అడవి పేరుతో వస్తున్న బన్నీ.. హిట్ పక్కా అంటున్న సుక్కు  

Allu Arjun Sukumar Movie Titled Seshachalam-allu Arjun,seshachalam,sukumar,telugu Movie News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతూ రికార్డులకు పాతర వేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను ఎగరేసుకుపోవడం ఖాయమని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్.

Allu Arjun Sukumar Movie Titled Seshachalam-Allu Seshachalam Sukumar Telugu News

ఇక ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో బన్నీ తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేయడమే కాకుండా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుతున్నారు చిత్ర యూనిట్.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమా మెజారిటీ షూటింగ్‌ను శేషాచలం అడవుల్లో చిత్రీకరించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.

దీంతో ఈ సినిమా టైటిల్ ‘శేషాచలం’ అయితేనే బాగుంటుందని సుక్కు అంటున్నారు.

మొత్తానికి బన్నీ-సుక్కు సినిమాకు అదిరిపోయే టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నట్లు అప్పుడే బన్నీ ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.

ఈ సినిమాతో బన్నీ మరోసారి మాస్ అవతారంలోకి మారనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తుండగా, హాట్ యాంకర్ అనసూయ ఓ అదిరిపోయే రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేథుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

తాజా వార్తలు

Allu Arjun Sukumar Movie Titled Seshachalam-allu Arjun,seshachalam,sukumar,telugu Movie News Related....