మారేడుమిల్లినే ఎందుకు 'పుష్ప' ఎంపిక చేసుకున్నాడు?

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్‌ రేపటి నుండి ప్రారంభం కాబోతుంది.

ఈ ఏడాది ఆరంభంలో పుష్ప సినిమా బన్నీ లేకుండా వారం పది రోజుల పాటు కేరళలో చిత్రీకరించారు.

అయితే కరోనా కారణంగా ఏకంగా ఏడు ఎనిమిది నెలల పాటు అదుగో ఇదుగో అంటూ వాయిదా వేయాల్సి వచ్చింది.భారీ అంచనాలున్న ఈ పాన్‌ ఇండియా సినిమా షూటింగ్‌ కు గాను తెలంగాణలోని మారేడుమిల్లి ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు.

ఏపీ లో పలు ప్రాంతాల్లో ఈ షూటింగ్‌ ఉంటుందని ప్రచారం జరిగింది.ఏపీకి సంబంధించినంత వరకు పుష్ప సినిమా అన్ని విధాలుగా బాగుంటుందని నిర్ణయానికి వచ్చిన సుకుమార్‌ గోదావరి జిల్లాల్లో మరియు వైజాగ్‌లో షూటింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

కాని అనూహ్యంగా ఈ సినిమా తెలంగాణలో మొదలు కాబోతుంది.కేరళలో జరగాల్సిన ఈ సినిమా షూటింగ్‌ మారేడుమిల్లిలో ఎందుకు జరుగుతుంది అంటూ కొందరు అనుకుంటున్నారు.

Advertisement

ఎందుకంటే అక్కడి వాతావరణం కాస్త అటు ఇటుగా కేరళను తలపిస్తుంది.దానికి తోడు అటవి ప్రాంతం మరియు పల్లె జనాలు కూడా సహజంగా ఉంటారు అనే ఉద్దేశ్యంతో సుకుమార్‌ అక్కడి వారిని ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

రెండు లేదా మూడు వారాల పాటు అక్కడ షూటింగ్‌ జరిపి ఆ వెంటనే కొత్త షెడ్యూల్‌ కు షిప్ట్‌ అవ్వబోతున్నారు.ఈ సినిమాను వచ్చే సమ్మర్‌ వరకు పూర్తి చేసేందుకు గాను చాలా ప్రయత్నాలు చేస్తున్న దర్శకుడు సుకుమార్‌ రెండవ షెడ్యూల్‌ నుండి రష్మికను హాజరు అవ్వాల్సిందిగా సూచించాడు.

ఇక ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం విజయ్‌ సేతుపతిని ఎంపిక చేయగా ఆయన తప్పుకున్నాడు.మరి ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారు అనేది చూడాలి.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు