నాకు ఆయనే వెంకటేశ్వరస్వామి.. స్టార్ హీరో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు.

టాక్ తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి.

చాలా సంవత్సరాల నుంచి కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కేరళ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు.

తాజాగా చిత్తూరు జిల్లాలో ఈ సినిమా మాసివ్ సక్సెస్ పార్టీ జరిగింది.ఈ పార్టీలో బన్నీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రెండు సంవత్సరాలు చిత్తూరు భాషను నేర్చుకుని తాను పుష్ప సినిమా చేశానని బన్నీ తెలిపారు.ఈ సినిమా కొరకు ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకున్నానని బన్నీ అన్నారు.

Advertisement

పుష్ప మూవీ రిలీజైన తర్వాత కనీసం ఒక్క ఫంక్షన్ అయినా చిత్తూరులో జరగాలని తాను భావించానని.పుష్ప సక్సెస్ పార్టీ చిత్తూరులో జరగడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని బన్నీ పేర్కొన్నారు.

చిత్తూరు ప్రజల వెనుక ఏడు కొండల స్వామి ఎలా ఉన్నాడో నా వెనుక సుకుమార్ అలానే ఉన్నాడని బన్నీ తెలిపారు.

సుకుమార్ తనకు వెంకటేశ్వర స్వామి అని బన్నీ చెప్పుకొచ్చారు.ఈ సినిమా వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చినా ఆ పేరుకు కారణం మాత్రం సుకుమార్ అని బన్నీ వెల్లడించారు.శ్రీవల్లిలా కాకుండా రష్మికలా కూడా ఆమె అంటే ఎంతో ఇష్టమని బన్నీ వెల్లడించారు.

దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఈ సినిమాకు ఆయన చాలా మంచి పాటలను ఇచ్చాడని బన్నీ చెప్పుకొచ్చారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

పుష్ప సినిమా కొరకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని బన్నీ చెప్పుకొచ్చారు.సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు బన్నీ ధన్యవాదాలు తెలిపారు.పుష్ప సినిమాలోని మాస్ డైలాగ్స్ ను చిత్తూరు యాసలో అద్భుతంగా చెప్పిన బన్నీ.

Advertisement

ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించారు.

తాజా వార్తలు