తూచ్.. ఆ వార్తలో నిజం లేదంటున్న పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఓ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తాడు.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో మరో బ్యూటీ నివేతా పేతురాజ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.దీంతో పాటు తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ నివేథా థామస్ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు, అసలు హీరోయిన్ ఆమేనని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి.

కాగా ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చిత్ర యూనిట్ వాటిపై స్పందించింది.ఈ సినిమాలో నివేథా థామస్ నటించడం లేదని వారు తెలిపారు.

Advertisement

ఇక ఈ సినిమాలో రష్మికయే హీరోయిన్ అని వారు క్లారిటీ ఇచ్చారు.దీంతో పుష్ప చిత్రంపై వస్తున్న పుకార్లు ఫుల్‌స్టాప్ పడిందని చెప్పాలి.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు