ఐకాన్ మూవీలో అంధుడుగా కనిపించనున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ చేస్తున్నాడు ఈ మూవీ.

సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ ఏకంగా రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం.ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ కి సుకుమార్ రంగం సిద్ధం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే దీని తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ మూవీని చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ ఐకాన్ మూవీని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు.

అయితే ఏవో కారణాల వలన ఆగుతూ వచ్చింది.అయితే ఈ సారి ఐకాన్ కథని మరింతా ఎస్టాబ్లిష్ చేస్తూ పాన్ ఇండియా అప్పీల్ తీసుకురమ్మని బన్నీ దర్శకుడు వేణు శ్రీరామ్ కి చెప్పినట్లు బోగట్టా.

Advertisement

వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ తో అల్లు అర్జున్ కి వేణు శ్రీ రామ్ మీద నమ్మకం రావడంతో ఐకాన్ మూవీలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు టాక్.ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఇప్పుడు మరో హాట్ న్యూస్ వినిపిస్తుంది.

ఇందులో బన్నీ మొదటి సారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.అలాగే ఒక పాత్రలో అల్లు అర్జున్ అంధుడుగా కనిపిస్తాడని, అ క్యారెక్టర్ సినిమాలో చాలా ఇంటరెస్టింగ్ గా ఉండబోతుందని సమాచారం.

బన్నీకి కూడా ఆ బ్లైండ్ క్యారెక్టర్ భాగా నచ్చిందని టాక్ వినిపిస్తుంది.రీసెంట్ గా రవితేజ రాజా ది గ్రేట్ లో అంధుడుగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

ప్రస్తుతం నితిన్ అంధుడు పాత్రలో కనిపిస్తున్నాడు.ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ ప్రయోగాత్మక పాత్రకి ఒకే చెప్పడం విశేషం.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు