Allu Arjun Allu Sirish : అల్లు అర్జున్ కన్నీళ్లు.. ఇకనైనా ఆ పుకార్లకు చెక్ పెట్టినట్లేనా?

గత కొన్ని రోజులుగా అల్లు ఫ్యామిలీ లో విభేదాలు కొనసాగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్, అల్లు శిరీష్ ల మధ్య అసలు సరిగా లేదని పుకార్లు వింటూ వస్తున్నాం.

ఆ కారణంగానే అల్లు శిరీష్‌ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా గురించి కనీసం ఒక్క ట్వీట్ కూడా అల్లు అర్జున్ చేయలేదు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది.అల్లు హీరో ల మధ్య గొడవ కు కారణం ఏంటి అనే విషయమై చాలా మంది చాలా రకాలుగా ఊహాలు వ్యక్తం చేయడం జరిగింది.

అల్లు ఫ్యామిలీ లో జరిగిన ఆస్తి పంపకాల వ్యవహారం లో వచ్చిన గొడవల కారణంగానే అల్లు బ్రదర్స్ మధ్య విభేదాలు నెలకొన్నాయి అంటూ ప్రచారం మొదలైంది.ఆ విషయం తార స్థాయి కి చేరింది.

ఇటీవలే అల్లు శిరీష్ స్పందిస్తూ ఎలాంటి విభేదాలు లేవు అంటూ స్పష్టత ఇచ్చాడు.

Advertisement

ఒక ట్వీట్‌ చేస్తేనే తమ మధ్య ప్రేమ ఉన్నట్లా అంటూ శిరీష్ ప్రశ్నించాడు.ఈ సందర్భం గా అల్లు శిరీష్ మాట్లాడుతూ తన సినిమా యొక్క సక్సెస్ మీట్ కి అన్నయ్య అల్లు అర్జున్ రాబోతున్నట్లుగా ప్రకటించాడు.అన్నట్లుగానే అల్లు అర్జున్ సక్సెస్ మీట్ కి వచ్చాడు.

ఆ సందర్భం గా శిరీష్ మాట్లాడుతుండగా అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టు కోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్షమని.

మీడియా లో వస్తున్న పుకార్లు అన్నింటికీ ఇదే సమాధానం అంటూ మెగా ఫ్యాన్స్ మరియు అల్లు ఫాన్స్ సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు.అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యే విధంగా అల్లు శిరీష్ మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అల్లు అర్జున్ తమ్ముడి గురించి మాట్లాడిన సందర్భంగా కూడా కాస్త ఎమోషనల్‌ అయిన విషయం తెల్సిందే.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు