సిట్టింగులకే సీట్లు కేసీఆర్ ప్రకటన... కాంగ్రెస్ లో ఆనందం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏది చేసినా దానికి ఒక స్పెషలిటీ ఉంటుంది.ఎవరికి అంతుపట్టని రీతిలో రాజకీయం చెయ్యడమే కేసీఆర్ స్టైల్.

గత కొద్ది కాలంగా ఉరకలు వేస్తూ ఎన్నికల కోసం ఎదురు చూపులు చూస్తున్న ఆయన ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా అనేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు.అందుకోసమే ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా ప్రభుత్వం, పార్టీ పరిస్థితుల గురించి, ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు అనే విషయాలపై ఆరా తీస్తూ దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నాడు.

తాజాగా కేసీఆర్ చేసిన ఒక ప్రకటన టీఆర్ఎస్ సిట్టింగ్ లకే కాదు కాంగ్రెస్ నాయకులకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.కేసీఆర్ ఎప్పుడూ సర్వేల మీదే పూర్తి స్థాయిలో ఆధారపడి పాలన సాగిస్తారని అందరికి తెలుసు.

ప్రతి పథకాన్ని ముందుగా లీకులు ఇస్తూ అది ప్రజల్లో ఎలా రెస్పాన్స్ వస్తుందో గ్రహించి అమలు చేయడమో.వెనక్కి పోవడమో చేస్తుంటారు.

Advertisement

గడిచిన నాలుగేళ్లుగా అదే చేసి సక్సెస్ అయ్యారు.ఇటీవలి రైతుబంధు, రైతు బీమా కూడా అలానే ముందు పత్రికలు, వివిధ వర్గాల ద్వారా లీకులు చేయించి దానికి మంచి ఆదరణ రావడంతో ఆ పథకాన్ని ప్రకటించారు.

అదొక్కటే కాదు సొంత పార్టీ నాయకుల మీద కూడా ప్రతి ఆరు నెలలకొకసారి ఇంటలిజెన్స్, వివిధ సర్వే సంస్థల ద్వారా వివరాలు రాబడుతుంటారు.అందులో ఎవరు ఏ నాయకుడి పనితీరు ఎలా ఉంది.? ఎసరు గెలుస్తారు .? ఎవరు గెలవరనే విషయాలను తెలుసుకుంటారు.అప్పట్లో కేసీఆర్ జరిపిన సర్వేలో తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ కు దాదాపు 80కు పైగా ఎమ్మెల్యేల్లో 40 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.

వారంతా వచ్చే ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమనే రిపోర్ట్స్ కేసీఆర్ కి అందాయి.దీంతో సర్వేల ఫలితాల ఆధారంగా గెలిచే వారికే టికెట్లు ఇస్తానని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించడం సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో ఆందోళన పెంచింది.

కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కేసీఆర్ ఓ సంచలన ప్రకటన చేసాడు.ప్రస్తుత ఎంపీ, ఎమ్యెల్యేలందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తానని ఎవరిని మార్చే ఉద్దేశం లేదని చెప్పడంతో వారిలో ఎక్కడ లేని ఆనందం కనిపిస్తోంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
నాగచైతన్య తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ మ్యాజిక్ రిపీట్ కావడం పక్కా!

వీరికే కాదు కేసీఆర్ ప్రకటన ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కూడా ఆనందాన్ని ఇస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్యెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.మళ్ళీ వారే పోటీ చేస్తే తమ చేతిలో సులువుగా ఓడిపోతారని కాంగ్రెస్ నాయకుల్లో ఒకటే ఆనందం కనిపిస్తోంది.

Advertisement

కానీ సీన్ లోకి వస్తే కానీ తెలియదు కదా ఎవరి సత్తా ఏంటో.

తాజా వార్తలు