అందరూ 'ఒక్కటై' బాబును 'కార్నర్'

సీమాంధ్రను తమ గపెట్ట్లొకి తెచ్చుకోవడానికి కొంగ్రెస్ పార్టీ అన్ని దారులు వేటుకుతుంది.

దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీనే కాకుండా బిజెపిని కూడా ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం వ్యూహరచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.

విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటు సమావేశాలకు ముందే ప్రధాని మోడీకి లేఖ రాయడాన్ని అందులో భాగంగానే చూస్తున్నారు.ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధపడిన గత తమ ప్రభుత్వాన్ని నిలదీసి, పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన బిజెపి వ్యవహారాన్ని కాంగ్రెసు అధిష్టానం ఇప్పుడు ఓ అస్త్రంగా ఎంచుకుంది.

ఇక దీనికి కౌంటర్ వేయడానికి అటు తెలుగుదేశం, ఇటు కమలం పార్టీ సిద్దంగా ఉన్నాయి.మరో పక్క రాజధానికి భూసేకరణ విషయంలో చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిపిఎంతో జత కట్టినట్లు కనిపిస్తోంది.

ఏది ఏమైనా అందరూ కలసి బాబు ను కార్నర్ చేసి తమ ఉనికి కాపాడుకునే చేస్తున్నారు.మరి దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisement
నల్లజాతి ఓటర్లకు దగ్గరయ్యేలా పావులు , ఆ కాలేజ్‌కి వెళ్లిన బైడెన్.. కానీ

తాజా వార్తలు