ఏపీలో ఈ సారి అధికారం వైసీపీదే అంటున్న ఎగ్జిట్ పోల్స్  

All Media Exit Polls Declared Ysrcp Will Be Win In Andhra-

మరో ఐదు రోజుల్లో ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ఈ నేపథ్యంలో తుది దశ లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో జాతీయ మీడియా సంస్థలతో పాటు కొన్ని రాజకీయ విశ్లేషణ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించాయి.రాబోయే ఎన్నికలలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే విషయాన్ని అంచనా వేసి చెప్పే ప్రయత్నం చేశాయి..

All Media Exit Polls Declared Ysrcp Will Be Win In Andhra--All Media Exit Polls Declared YSRCP Will Be Win In Andhra-

అయితే మీడియా సంస్థల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చూస్తుంటే కొంత గందరగోళం ఉండటం విశేషం.జాతీయ మీడియా సంస్థలు సర్వేలలో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా, లగపాటిరాజగోపాల్ మాత్రం టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఈ ఒక్క మీడియా సంస్థ గాని విశ్లేషణ సంస్థ గాని జనసేన పార్టీని లెక్కలోకి తీసుకోకపోవడం గమనార్హం.

ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సరళి ఒకసారి చూసుకుంటే లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో ఈ సారి టిడిపి 100 సీట్లతో అధికారంలోకి వస్తుందని, వైసిపి 72 సీట్లు గెల్చుకుంటుందని, జనసేన సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు.పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ వైసీపీ 112 సీట్లు తెచ్చుకొని ఈసారి అధికారంలోకి వస్తుందని, టిడిపి కేవలం 59 స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వేలో తెలియజేశారు.ఇక మిషన్ చానిక్య సర్వేలు వైసిపి 91 నుంచి 105, టిడిపి 56 నుంచి 61 స్థానాల్లో లో విజయం సాధిస్తాయని తెలిపాయి.జాతీయ మీడియా సంస్థలు ఈసారి ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేయడం జరిగింది.