జియో ప్లాన్స్ లో మార్పులు .. లాభమా నష్టమా ?

జియో ధనాధన్ ప్లాన్స్ ముగింపు దశలో ఉన్నాయి.

సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ పొందిన వారికి మరో నెల ఎలాగో ఇబ్బంది లేదు కాని ఆ ఆఫర్ మిస్ చేసుకొని జియో ధనాధన్ ప్లాన్ వాడుతున్న వారి గడువు మరికొద్ది రోజుల్లో తీరిపోతుంది.

ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్ లాంటి సంస్థలు చౌకగా ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తూ ఉండటంతో, జనాలు కేవలం జియోపైనే ఆధారపడాల్సిన అవసరం లేకుండాపోయింది.ఈమధ్య కాలంలో జియో కొత్త వినియోగదారుల రేటు కూడా గణనీయంగా పడిపోయింది.

దాంతో జియో మరమ్మత్తు చర్యలు మొదలుపెట్టింది.అందులో భాగంగానే ఉన్న ఆఫర్లకి కొన్ని మార్పులు చేయడంతో పాటు కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతోంది.రూ.309 మరియు రూ.509 రిచార్జుల్లో కొన్ని మార్పులు చేసింది జియో.సమ్మర్ సర్ప్రైజ్మ్, ధనాధన్ ఆఫర్ ముగిసిన తరువాత, నార్మల్ గా ఐతే 309 రూపాయలకు రోజుకి ఒక జిబి డేటా, 28 రోజుల పాటు రావాలి.

ఇది ఇంతకుముందు ప్రకటించిన ఆఫర్.కాని దీని నిడివిని పోడిగిస్తోంది జియో.ఇకనుంచి 56 రోజుల పాటు ఈ ఆఫర్ పనిచేస్తుంది.

Advertisement

అంటే నిడివిని డబుల్ చేస్తున్నారు అన్నమాట.ఇక 509 రూపాయల రీచార్జికి రోజుకి 2 GB 28 రోజులపాటు రావాలి.

ఈ ఆఫర్ లో కూడా నిడివి మార్పులు చేస్తోంది జియో.ఇందులో కూడా 28 రోజుల వ్యాలిడిటిని 56 రోజులకి పెంచేసింది.

ఇక రెండు కొత్త ప్లాన్స్ రాబోతున్నట్టు సమాచారం.అందులో ఒకటి 349 రూపాయల రీచార్జ్ కాగా, మరొకటి 399 రూపాయల రీచార్జ్.349 రూపాయల రీచార్జ్ కి 20 GB డేటా వస్తుంది.ఇందులో రోజుకి ఇంత అని డేటా లిమిట్ లేదు.

ఆ 20 GB ని మీర్ ఒక్కరోజులో ఖాళి చేయొచ్చు, బుద్ధిగా 56 రోజులు కూడా వాడుకోవచ్చు.ఒక్కసారి 20GB వాడటం పూర్తయితే స్పీడ్ 128 KBPS కి పడిపోతుంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

ఇక 399 రూపాయల ప్యాక్ విషయానికి వస్తే రోజుకి 1 GB వస్తుంది.వ్యాలిడిటి మాత్రం అద్భుతం.

Advertisement

ఏకంగా 84 రోజుల నిడివి.మోడరేట్ గా ఇంటర్నెట్ వాడేవారికి చక్కగా సరిపోయే ఆఫర్ ఇది.999 రూపాయల రీచార్జిపై వ్యాలిడిటి ఇంతకుముందు 60 రోజులు ఉండేది, దాన్ని 90 రోజులు చేసారు.1999 రూపాయల రిచార్జీ వ్యాలిడిటి ఇంతకుముందు 90 రోజులు ఉంటే, ఇకనుంచి 120 రోజులు ఉంటుంది.4999 రూపాయల రీచార్జ్ యొక్క కొత్త నిడివి 210 రోజులు కాగా, 9999 రూపాయల ప్లాన్ 300 పనిచేయబోతోంది.

తాజా వార్తలు