Pawan Kalyan Ali: తన కూతురు పెళ్లికి పవన్ ఎందుకు రాలేదో కారణం చెప్పిన ఆలీ..!!

వెండితెర పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీది తిరుగులేని కాంబినేషన్.వీరిద్దరి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తది.

ఇద్దరూ కూడా బయట మంచి స్నేహితులు.తన సినిమాలో ఆలీకి పాత్ర లేకపోయినా గాని కావాలని.

ఒక ప్రత్యేకమైన పాత్ర ఆలీకి కేటాయించి మరి పవన్ శ్రద్ధ తీసుకునేవాళ్లు.కానీ ఇద్దరు రాజకీయాల్లోకి వెళ్లాక ఒకానొక సమయంలో ఒకరిపై మరొకరు సున్నితమైన విమర్శలు చేసుకున్న పరిస్థితి దాపురించింది.

ఆ తర్వాత పవన్ నటించిన సినిమాలలో ఆలీ కనిపించలేదు.దీంతో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఇదే సమయంలో ఇటీవల ఆలీ కూతురు వివాహం జరగటం తెలిసిందే.హైదరాబాద్ లో వివాహం.

గుంటూరులో రిసెప్షన్ నిర్వహించారు.ఈ రెండు కార్యక్రమాలకు ఇండస్ట్రీ నుండి ఇంక రాజకీయ రంగం నుండి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.

అయితే హైదరాబాదులో లేదా గుంటూరులో జరిగిన ఏ కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు.దీంతో ఆలీ కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదు అన్నదానిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి.

ఈ క్రమంలో తన కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు.దాని గురించి ఆలీ స్పందించాడు."నా కూతురు పెళ్లికి పవన్ నీ ఆహ్వానించాను.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?
చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు..!!

శుభలేఖ కూడా ఇచ్చాను.పెళ్లికి వస్తానని ఆయన చెప్పారు.

Advertisement

సెక్యూరిటీ సిబ్బంది వచ్చి రూట్ మ్యాప్ కూడా చూసుకున్నారు.కానీ చివరి నిమిషంలో ఫ్లైట్ క్యాన్సిల్ కావటంతో రాలేకపోయానని పవన్ కాల్ చేసి తెలియజేశారు.

వధూవరులను ఇంటికి వచ్చి కలుస్తానని.చెప్పారు అని ఆలీ క్లారిటీ ఇచ్చారు.

తాజా వార్తలు