అయ్యోయో.. మోకాళ్ల లోతు నీటిలో వధూవరులు.. చివరకు? (వీడియో)

సాధారణంగా పెళ్లిళ్లు అంటే అనేక తంతులు జరుగుతూ ఉంటాయి.

ఈ క్రమంలో వధూవరులు ఇద్దరు చేసే కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇలా వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని అందరినీ ఆకట్టుకుంటూ ఉంటే మరికొన్ని అందర్నీ ఆలోచింప చేసేలా విధంగా ఉంటాయి.అచ్చం అలాంటి సంఘటననే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

సాధారణంగా వర్షాకాలంలో పెళ్లిళ్లు( Weddings in monsoon ) చాలా తక్కువగానే ఉంటాయి.కానీ, ప్రస్తుతం వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు కాబట్టి చలికాలంలో కూడా వర్షాలు, తుఫాన్లు సంభవిస్తున్నాయి.వర్షాలు కురిస్తే పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేసుకునేవారు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.అచ్చం అలాగే లోతట్టు ప్రాంతంలో వర్షం కారణంగా నిలిచిన నీళ్లలో వధూవరులు ఇద్దరు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో( social media ) వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Advertisement

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.వివాహానంతరం వరుడు( groom ) తన భార్యను తన ఇంటికి తీసుకొని వెళుతున్న క్రమంలో భారీ వర్షం పడడంతో వారి ఇంటికి వెళ్లే వీధి మొత్తం నీటితో నిండిపోయింది.

దీంతో ఆ వరుడు తన భార్యతో కలిసి మోకాళ్ళ లోతులో ఉన్న నీటి నుంచి నడవడం మొదలుపెట్టాడు.ఆ వీధిలో ఉన్న వారందరూ కూడా ఆ కొత్త జంటను అలానే చూస్తూ ఉండిపోయారు.ఇక ఈ వీడియోను చూసిన కొంత మంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు.

ఏంటి బాసు.పెళ్లి సందర్భంగా ఊరంతా ఈతకొలనులాగా మార్చారా అని కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.

మరికొందరు కనీసం నీ భార్యనైనా ఎత్తుకొని వెళ్ళాల్సింది బ్రదర్ అని కామెంట్ చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. రన్నింగ్ ఆటోలోనే దాన్ని రిపేర్ చేసేస్తున్నాడుగా
Advertisement

తాజా వార్తలు