ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలు వారికి సంబంధించి ఏదైనా ఒక పెద్ద వేడుక జరిగితే ఆ వేడుకను భారీ ధరలకు అమ్మేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు వారి పెళ్లికి సంబంధించిన వేడుకను వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కి భారీ ధరలకు అమ్మేస్తున్నారు.
ఇక ఇటీవల మన సౌత్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా తన పెళ్లి వేడుకను ఓటీటీ సంస్ధ నెట్ ఫ్లిక్స్ కి భారీ ధరలకు అమ్మారు.ఈ క్రమంలోనే మరో టాలీవుడ్ జంట కూడా ఇదే బాటలో వెళుతోందని తెలుస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు ఒక మంచి సక్సెస్ అందుకున్న నాగచైతన్య( Nagachaitanya ) త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు.ఇదివరకు ఈయన సమంత( Samantha ) ను పెళ్లి చేసుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.ఇలా విడాకులు తీసుకున్న నాగచైతన్య తిరిగి శోభిత ( Sobhita ) ప్రేమలో పడ్డారు.డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరగబోతోంది.
ఇప్పటికే వీరు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.మీరు పెళ్లికి సంబంధించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సమంత నాగచైతన్య పెళ్లి వేడుకలను నెట్ ఫ్లిక్స్( Net Flix ) వారు ఏకంగా 50 కోట్లకు కొనుగోలు చేశారని సమాచారం.
వీరి పెళ్లి వేడుకను చూడాలి అంటే మనం నెట్ ఫ్లిక్స్ లోనే చూడాల్సి ఉంటుంది అంటూ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.మరి ఈ విషయంపై ఇప్పటికి నాగచైతన్య కానీ శోభిత కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.