ప్రభాస్‌ను టార్గెట్‌ చేసిన నాగార్జున.. సాహోను ఢీ కొట్టేందుకు సై  

Akkineni Nagarjuna Targets To Prabhas-manmadhudu 2,nagarjuna,prabhas,sahoo Movie

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. అందులో భాగంగా రేపు అంటే జూన్‌ 13న సాహో టీజర్‌ విడుదలకు రంగం సిద్దం అయ్యింది. అంతా అనుకున్నట్లుగా జరిగితే ముందే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చివరి దశ చిత్రీకరణలో ఉన్న సాహోను ఢీ కొట్టేందుకు మన్మధుడు ఆసక్తి చూపుతున్నాడు..

ప్రభాస్‌ను టార్గెట్‌ చేసిన నాగార్జున.. సాహోను ఢీ కొట్టేందుకు సై -Akkineni Nagarjuna Targets To Prabhas

నాగార్జున హీరోగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా సమంత కీలక పాత్రలో నటించిన ‘మన్మధుడు 2’ కు రాహుల్‌ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంకు సంబంధించిన టీజర్‌ను జూన్‌ 13న అంటే రేపు విడుదల చేయబోతున్నారు. సాదారణంగా ఈమద్య కాలంలో ఒక స్టార్‌ హీరో సినిమా టీజర్‌ వచ్చినా మరో హీరో టీజర్‌ను విడుదల చేసేందుకు ఆసక్తి చూపించరు.

కాని సాహో టీజర్‌ వచ్చిన రోజే మన్మధుడు 2 టీజర్‌ కూడా రాబోతుంది..

ఇక సాహో సినిమాను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాహోకు కేవలం వారం రోజుల గ్యాప్‌తోనే మన్మధుడు కూడా రాబోతున్నాడు. సాహో విడుదలకు రెండు వారాల ముందు నుండి పెద్ద సినిమాలు ఏమీ ఉండవని అంతా భావించారు. కాని ఆగస్టు 9వ తారీకున మన్మధుడు 2 చిత్రం రాబోతుంది.

మన్మధుడు విడుదలైన వారం రోజుల్లోనే సాహో రాబోతుంది..

అంటే సాహోతో మన్మధుడు ఢీ అంటే ఢీ అన్నట్లే కదా అంటూ విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ప్రభాస్‌ను మరీ ఇంతగా నాగార్జున ఎందుకు టార్గెట్‌ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ ఢీ లో సాహో కింద మన్మధుడు చిత్తు అవ్వడం ఖాయం అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.