పవన్ కళ్యాణ్ మీద వచ్చే విమర్శలపై అకిరా రియాక్షన్ ఇలా ఉంటుందా..?రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!

రాజకీయాలు అంటే బురద.ఎంత మంచి మనిషి అయినా తిట్టించుకోక తప్పదు.

అప్పటి వా౪రకు మిత్రులుగా ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా శత్రువులుగా మారిపోతుంటారు.

అందుకే ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి, కనీసం దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు సినీ సెలబ్రిటీస్.

కానీ కొంతమంది మాత్రం సమాజం లో జరుగుతున్న అవినీతిని చూడలేక, తమ గొంతుని వినిపించడానికి రాజకీయాల్లోకి వస్తుంటారు.ఎవరైనా వయస్సు అయిపోయిన తర్వాత, సినిమాల్లో కెరీర్ ముగిసిన తర్వాత రాజకీయాల్లోకి రావడం మనమంతా చూసాము.

కానీ అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత జనసేన పార్టీ ( Janasena party )తో రాజకీయ అరంగేట్రం చేసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.తొలుత 2014 ఎన్నికలలో పోటీ చెయ్యకుండా టీడీపీ - బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపాడు.

Advertisement

ఆ తర్వాత 2019 ఎన్నికలలో పోటీ చేసి ఘోరమైన పరాజయం ని చవి చూసాడు.ఇప్పుడు 2024 ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాడు.

రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ పార్టీ తో కలిసి ఆయన ఎన్నికల్లో పోటీ చెయ్యబోతున్నాడు.ప్రస్తుతానికి సర్వేల లెక్కల ప్రకారం టీడీపీ - జనసేన కూటమే ఎన్నికలలో గెలుస్తుందని అంటున్నారు.ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ని వైసీపీ పార్టీ వాళ్ళు తిడుతున్నప్పుడు కుటుంబ సభ్యులతో పాటుగా అభిమానులకు కూడా ఎంతో బాధ మరియు కోపం వస్తుంది.

అలాగే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై వైసీపీ నాయకులూ చేసే కామెంట్స్ ని ఆయన కొడుకు అకిరా నందన్ ఫాలో అవుతూ ఉండేవాడట.ఆ కామెంట్స్ విన్నప్పుడు అతనిలో కూడా బాధ మరియు కోపం వచ్చేది కానీ, చాలా వరకు తనని తానూ కంట్రోల్ చేసుకుంటాడట.

జిమ్ లో వర్కౌట్స్ చెయ్యడం, యోగా వంటివి చెయ్యడం అకిరా కి బాగా అలవాటు అవ్వడం కారణంగా ఆయన ఏ విషయాన్నీ కూడా సీరియస్ గా మైండ్ లోకి తీసుకోదట.ఈ విషయాన్నీ రేణు దేశాయ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఇకపోతే అకిరా నందన్( Akira Nandan ) ప్రస్తుతం ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.భవిష్యత్తులో సినిమాల్లోకి వస్తాడో లేదో తెలియదు కానీ, ప్రస్తుతానికి అయితే తీసుకుంటున్నాడు, అతనిని నటుడు అవ్వాలని ఇష్టం లేదు, పలు మార్లు అడిగి కూడా చూసాను, ఇప్పుడే దీని గురించి ఎందుకు అమ్మా మాట్లాడడం అని తప్పించుకునేవాడు.కానీ ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు కాబట్టి అభిమానులు లాగానే నేను కూడా సినిమాల్లోకి హీరో గా ఎంట్రీ ఇస్తాడని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.

Advertisement

తాజా వార్తలు