దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా ఎనౌన్స్ చేశారు.ఆ సినిమాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నారు.
అయితే పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ సినిమా చేయాలనే ఉద్దేశం లేదన్నట్టు తెలుస్తుంది.దిల్ రాజు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసి ఐకాన్ కథని వేరే హీరోకి తగినట్టుగా మార్పులు చేయమని డైరక్టర్ కి చెప్పాడట.
అంతేకాదు ఇద్దరు ముగ్గురు హీరోలని అనుకుని ఫైనల్ గా ఐకాన్ హీరోని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.ఇంతకీ ఐకాన్ గా ఎవరు కనిపించనున్నారు అంటే అక్కినేని యువ హీరో అఖిల్ అని అంటున్నారు.
ప్రస్తుతం ఏజెంట్ సినిమా చేస్తున్న అఖిల్ తన నెక్స్ట్ సినిమా దిల్ రాజు బ్యానర్ లో కమిట్ మెంట్ ఉంది.ఎలాగు అల్లు అర్జున్ చేయనని అంటున్నాడు అని ఐకాన్ సినిమాని అఖిల్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు దిల్ రాజు.
వేణు శ్రీరాం కూడా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టాడు.సో డైరక్టర్ పరంగా అఖిల్ డౌట్ పడాల్సిన అవసరం లేదు.
ఏజెంట్ తర్వాత అఖిల్ సినిమాల లైనప్ చాలా బాగుందని అంటున్నారు.దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ ప్లాన్ చేస్తుండగా మరో స్టార్ డైరక్టర్ తో సినిమా కూడా లైన్ లో ఉందని అంటున్నారు.
ఈ రెండు సినిమాలతో అఖిల్ తన రేంజ్ పెంచుకుంటాడని తెలుస్తుంది.బ్యాచిలర్ సినిమాతో కెరియర్ లో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న అఖిల్ రాబోయే సినిమాలతో కూడా వరుస హిట్లు టార్గెట్ పెట్టుకున్నాడు.
ఏజెంట్ ఎలాగు మాస్ ఎంటర్టైనర్ గా భారీ క్రేజ్ తో వస్తుంది.ఆ సినిమా తర్వాత వచ్చే సినిమాలు కూడా అదే హవా కొనసాగించే ఛాన్స్ ఉంది.