అఖిల్ ఏజెంట్ న్యూ పోస్టర్ అదిరింది..!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరియర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న అఖిల్ తన నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.

ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.

సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.అఖిల్ ఏజెంట్ సినిమా నుండి కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఏజెంట్ సినిమా నుండి అఖిల్ క్రేజీ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు.

ఆగష్టు 12న సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అఖిల్ ఏజెంట్ తో కెరియర్ లో మరో సాలిడ్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.

Advertisement

అఖిల్ ఏజెంట్ సినిమా తెలుగులో ప్రత్యేకంగా రాబోతున్న స్పై థ్రిల్లర్ మూవీ అని చెబుతున్నారు.ఏజెంట్ సినిమా పోస్టర్స్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.

సినిమా రిజల్ట్ పై అఖిల్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడని టాక్.సినిమాలో మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు