మహాలక్ష్మి ఆలయంలో అఖండ భజన కార్యక్రమం - పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సాధు సజ్జన భజన మండలి కళాకారులచే నిర్వహిస్తున్న అఖండ భజన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తొలి ఏకాదశి పర్వదినాన సాధు సజ్జన భజన మండలి వారి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో 24 గంటల అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, దాని వలన వర్షాలు సమృద్ధిగా గురించి పాడిపంటలు చల్లగా ఉండేలా అమ్మవారి దీవిస్తుందని అన్నారు.

గత 20 సంవత్సరాలుగా వివిధ హోదాలలో భజన కార్యక్రమానికి హాజరవుతున్న తాను ప్రస్తుతం శాసనసభ్యుని హోదాలో హాజరవ్వడం సంతోషకరంగా ఉందని అన్నారు.అమ్మవారి దయతో కరువు కాటకాలు రాకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని, అలాగే వివిధ కీర్తనలతో అమ్మవారి భజనలు చేస్తున్న కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు.

నేడు రూ. లక్ష లోపు రుణమాఫీ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Latest Rajanna Sircilla News