ఉద్యోగులకు షాకిచ్చిన ఎయిరిండియా..!

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎయిరిండియా సంచలన నిర్ణయం తీసుకుంది.పైలట్లకు ఇచ్చే వేతనంలో 40 శాతం కోత విధిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.

ఈ నిబంధనలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.పైలట్లతో పాటు క్య్రూ సిబ్బందిపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

కాగా, విమానయాన మంత్రిత్వ శాఖ నిర్దేశాల మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఎయిరిండియా పేర్కొంది.రూ.25 వేల గ్రాస్ శాలరీ ఉన్న ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించదని స్పష్టం చేసింది.ఈ 40 శాతంతో పాటు ఇతర అలవెన్సులు కలుపుకుని 85శాతం వరకు నష్టపోతున్నామని పైలట్లు వాపోతున్నారు.

ఫ్లెయింగ్ అలవెన్స్, స్పెషల్ పే, వైడ్ బాడీ అలవెన్స్, చెక్ అలవెన్స్, ఎగ్జామినర్ అలవెన్స్‎లలో 40శాతం వరకు కోత విధించినట్లు పైలట్లు చెబుతున్నారు.ఎయిరిండియా నిర్ణయంతో గ్రాస్ శాలరీలో తేడాతో తాము భారీగా నష్టపోతున్నామని.

Advertisement

తమకు న్యాయం చేయాలని పైలట్లు కోరుతున్నారు, కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా అనేక రంగాలు కుదేలవుతున్నాయి.విమానయాన రంగంపై కరోనా ఎఫెక్ట్ అధికంగా ఉంది.

అయితే వందే భారత్ మిషన్ ద్వారా ఎయిరిండియా నష్టాన్ని పూడ్చుకోగలిగింది.మరోవైపు లాక్‎డైన్‎తో నష్టపోయిన ఇండిగో సంస్థ తన సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించింది.

Advertisement

తాజా వార్తలు