విడ్డూరం : లేడీ కానిస్టేబుల్‌ను అప్పుడు సస్పెండ్‌ చేసిన అధికారులే ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటున్నారు

టిక్‌టాక్‌ ఈమద్య కాలంలో ఏ స్థాయిలో ఇండియాలో పెరిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కరోనా వైరస్‌ అయినా మెల్లగా ఇండియాలో పాకింది కాని టిక్‌టాక్‌ మాత్రం జెట్‌ స్పీడ్‌తో కేవలం ఏడాదిలో కోట్లాది మందికి పాకింది.

ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం అనే విషయాన్ని పక్కన పెట్టి టిక్‌టాక్‌లు చేస్తూనే ఉన్నారు.అలా టిక్‌టాక్‌లు చేసిన వారు కొందరు జీవితాన్ని నాశనం చేసుకుంటే మరి కొందరు సెలబ్రెటీ ఫేమ్‌ను దక్కించుకున్నారు.

సెలబ్రెటీలుగా మారిన వారి కంటే సన్నాసులుగా మారిన వారే ఎక్కువ.అయినా కూడా మనం సెలబ్రెటీల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం.

ఎందుకంటే వారు తక్కువగా ఉంటారు కనుక.ఇక సెలబ్రెటీగా మారిన వారిలో గుజరాత్‌కు చెందిన లేడీ కానిస్టేబుల్‌ అల్పితా చౌదరి.

Advertisement

ఈమె డ్యూటీలో ఉండి యూనిఫార్మ్‌ వేసుకునే టిక్‌టాక్‌ వీడియో చేసింది.ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అయ్యింది.

ఆమె వీడియోకు మిలియన్స్‌ వ్యూస్‌, లక్షల్లో లైక్స్‌ వచ్చాయి.అదే సమయంలో ఉన్నతాధికారుల నుండి సస్పెన్షన్‌ కూడా వచ్చింది.

దాదాపుగా నెల రోజులు సస్పెండ్‌ అయిన అల్పితా చౌదరి మళ్లీ డ్యూటీలో చేరింది.ఈ గ్యాప్‌లో అల్పితా సింగర్‌గా మంచి పేరు దక్కించుకుంది.గుజరాతీ జానపద పాటలు పాడటంతో ఆమెకు మంచి ఫేమ్‌ దక్కింది.

తాజాగా ఈమె పాడిన కొత్త ఆల్బమ్‌ ఒకటి విడుదల అయ్యింది.మళ్లీ ఈమె సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?
చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు..!!

ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నట్లుగా చెబుతోంది.దీంతో కానిస్టేబుల్‌ జాబ్‌కు లాంగ్‌ లీవ్‌ తీసుకోవాలని భావిస్తుందట.

Advertisement

ఈ సమయంలోనే పోలీసు ఉన్నతాధికారులు ఈమెతో సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇది సోషల్‌ మీడియాతో వచ్చే ఫేమ్‌ అన్నట్లుగా ఉంది.

తాజా వార్తలు