'ఆచార్య' పోయిన చరణ్ రోల్ కు మంచి స్పందన!

ఇటీవలే రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యింది.అలాగే ఎప్పటి లాగానే బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టింది.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు మంచి పేరు వచ్చింది.

చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించాడు.ఈ పాత్ర కారణంగానే చరణ్ కు పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు లభించింది.

ఈ సినిమా లో ఆయన చేసిన పాత్రకు మెగా ఫ్యాన్స్ నుండి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.రామ్ చరణ్ ను సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం తర్వాత ఈయన నటన పరంగా మరింత మెరుగుగా చూడడం మెగా ఫ్యాన్స్ కు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు.

Advertisement

మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.మాములు ప్రేక్షకులు సైతం చరణ్ నటనను మెచ్చారు.

ఇక ఇప్పుడు వచ్చిన ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమాలో ఈయన సిద్ధ అనే కీలక పాత్రలో నటించాడు.చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆచార్య.ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ అనుకుంటే ఆమెను కుదరక తప్పించారు.రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

అయితే ఈ సినిమా కొరటాల మార్క్ కనిపించలేదు.దీంతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.కథ, స్క్రీన్ ప్లే అంతా తేలిపోవడంతో ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

Advertisement

అయితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఈ సినిమాలో చరణ్ పాత్రకు మంచి ఆదరణ దక్కింది.ఈయన రామరాజు తర్వాత మళ్ళీ ఆచార్య లో సిద్ధ పాత్రతో రావడం అది ప్రేక్షకులకు నచ్చడంతో మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

తాజా వార్తలు