భార్య గొడవ భరించలేక పోతున్నారు... ఈ ఇయర్ ప్లగ్ మీకోసమే  

Afraid Of Wife\'s Fight-fight,invention,night Time,sleep,sounds,tablet Shape,technology,wife

పెరిగిన టెక్నాలజీతో పెద్ద పెద్ద వస్తువులను కూడా చిన్న వస్తువులుగా తయారు చేస్తున్నారు. ఒకప్పుడు కంప్యూటర్ అంటే చాలా పెద్దగా ఉండేది. కానీ ఇప్పుడు కంప్యూటర్ అంటే అతి చిన్న వస్తువుగా అయ్యింది..

భార్య గొడవ భరించలేక పోతున్నారు... ఈ ఇయర్ ప్లగ్ మీకోసమే-Afraid Of Wife's Fight

అలాగే ప్రతి వస్తువు కూడా చిన్న చిన్నగా మారిపోతున్నాయి. ఫ్లారె ఆడియో సంస్థ ఇటీవల స్లిప్ అనే సరికొత్త ఇయర్ ప్లగ్ ను కనిపెట్టారు. చిన్న ట్యాబ్లెట్ రూపంలో ఉన్న ఒక చిన్న ఇయర్ ప్లగ్ ను కనిపెట్టడం జరిగింది.

ఇది చెవిలో పెట్టుకుంటే బయట శబ్దాలు ఏవి వినిపించావు.

రాత్రి సమయాల్లో బయట శబ్దాలు వినిపించకుండా హాయిగా నిద్ర పోవాలని అనుకునే వారికోసం ఈ పరికరాన్ని తయారు చేసినట్లుగా కంపెనీ వారు ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఒక వ్యక్తి ఈ పరికరంను భార్యల నుండి భర్తలు పడుతున్న ఇబ్బందులు తప్పించుకునేందుకు ఉపయోగించవచ్చు అని కొత్త విషయాన్ని కనిపెట్టాడు.

ఈ విషయాన్ని గురించి ఆ వ్యక్తి స్పందిస్తూ భార్యల గోడను వినకుండా ఇది పనికి వస్తుందా అంటూ కొంటెగా ఆన్ లైన్ లో ప్రశ్నించాడు.

అతడి కొంటె ప్రశ్నకు కంపెనీ వారు కూడా అదే తరహాలో సమాధానం ఇచ్చారు. మీరు దీనిని ఎలా అయినా వాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఉపయోగం పొందే ఉద్దేశ్యంతో ఈ పరికరాన్ని తయారు చేసాం.

మీరు దీనిని మీకు అనుకూలంగా వనియోగించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ కంపెనీ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి పరిశీలన దశలో ఉన్న ఈ మైక్ త్వరలోనే ఇండియాకు కూడా రావడం ఖాయం. మరెందుకు ఆలస్యం అన్నట్లుగా వచ్చిన వెంటనే కొనుగోలు చూసేయండి..