టాలీవుడ్ లో రీ రిలీజ్ హంగామా ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ రిలీజ్ రికార్డ్స్ మొత్తం పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్యనే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’, ‘జల్సా’( Kushi movie ) చిత్రాలు రీ రిలీజ్ అయ్యి ఆల్ టైం రికార్డ్స్ నెలకొల్పగా, మహేష్ బాబు హీరో గా నటించిన ‘పోకిరి’ మరియు ‘బిజినెస్ మెన్’ చిత్రాలు కూడా ఆల్ టైం రికార్డ్స్ నెలకొల్పాయి.బిజినెస్ మెన్ చిత్రం కేవలం మొదటి రోజు రికార్డు ని నెలకొల్పింది కానీ, ఫుల్ రన్ లో ఖుషి రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యలేకపోయింది.
వీళ్లిద్దరి రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడానికి చాలా సినిమాలే వచ్చాయి.ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘సింహాద్రి( Simhadri )’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎలా అయినా రికార్డు కొట్టాలి అనే కసితో సుమారుగా రెండు నెలల నుండి ప్రొమోషన్స్ చేసి మరీ రిలీజ్ చేసారు.

అంత హంగామా చేసినప్పటికీ కూడా ఈ చిత్రం ఖుషి రికార్డ్స్ కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.అయితే ‘సింహాద్రి( Simhadri ) ‘ చిత్రం కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చే సినిమా అని, మామూలు ఆడియన్స్ లో ఆ చిత్రానికి పెద్దగా క్రేజ్ లేదని, అందుకే రికార్డు పెట్టలేకపోయామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.‘అదుర్స్’ చిత్రం చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రం అని, ఈ సినిమా తో ఎవ్వరూ ముట్టుకోలేని రికార్డ్స్ ని నెలకొల్పుతాము అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సవాలు చేసారు.అనుకున్నట్టుగానే ‘అదుర్స్’( Adhurs ) చిత్రాన్ని 4K కి మార్చి, ఈ నెల 18 వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ కి ప్లాన్ చేసారు.
కచ్చితంగా రికార్డు పెడుతుంది అనుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు.

ముఖ్యమైన సిటీలలో కూడా ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ ముందుకు కదలకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ సినిమాకి కనీసం 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చేలా లేదని అంటున్నారు.ఈ చిత్రం 4K కి మార్చడానికి దాదాపుగా 20 లక్షల రూపాయిలు ఖర్చు అయ్యింది.
ఆ తర్వాత పబ్లిసిటీ చెయ్యడానికి మరో 5 లక్షల రూపాయిలు ఖర్చు అయ్యింది.బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవాలంటే కనీసం 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి.20 లక్షల రూపాయిలు వచ్చే ఛాన్స్ కూడా కనిపించకపోవడం తో నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.