క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారిని ఆడించిన అడివి శేష్.. ఈ హీరో గ్రేట్ అంటూ?

టాలీవుడ్ హీరో అడివి శేష్‌ ( Adivi Sesh )గురించి మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు అడివి శేష్‌.

ఈ మధ్యకాలంలో ఈయన నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.దీంతో కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తున్నారు అడివి శేష్‌.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో అడివి శేష్‌ మంచి మనసు చాటుకున్నాడు. క్యాన్సర్‌ తో పోరాడుతున్న చిన్నారి కీర్తిని కలిసి తనతో సరదాగా కాలక్షేపం చేశాడు.

ఆ చిన్నారిని ఎత్తుకొని ఆటలాడాడు.

Advertisement

ఈ సందర్భంగా తనకు బొమ్మలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.క్యాన్సర్‌ చికిత్సలో భాగం కీమోథెరపీ ( Chemotherapy )చేసినప్పుడు తలపై వెంట్రుకలు తీసేస్తారు.అలా వెంట్రుకలు పోగొట్టుకున్న కీర్తి( keerthi ) తను వేసిన డ్రాయింగ్‌ లోనూ పాపకు జుట్టు తీసేసింది.

కాగా ఈ అడివి శేష్‌ ఆ చిన్నారిని ఆడిస్తూ, నవ్విస్తూ చాలాసేపు కబుర్లు కూడా చెప్పాడు.కాసేపు తన బాధనంతా మర్చిపోయి సంతోషంగా నవ్వేలా చేశాడు.అలాగే ఆ చిన్నారికి ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు మిగిల్చి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శేష్‌ మంచితనానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.బిజీ టైంలోనూ పాప కోసం సమయం కేటాయించడాన్ని కొనియాడుతున్నారు.ఇకపోతే అడివి శేష్‌ సినిమాల విషయానికి వస్తే.

ఇదేం విచిత్రం.. 32 పళ్లతో పుట్టిన బిడ్డ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు??
అమ్మ ఏడ్చింది.. కర్మ ఎవ్వరినీ వదలదు.. సుమన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రస్తుతం డెకాయిట్‌ అనే సినిమా చేస్తున్నాడు.షానీల్‌ డియో ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Advertisement

అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.తెలుగు, హిందీలో ఈ మూవీ చిత్రీకరిస్తున్నారు.

తాజా వార్తలు