యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమా కోసం సాయం చేసిన ముగ్గురు స్టార్స్ వీళ్లే!

హీరో జూనియర్ ఎన్టీఆర్( Hero Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Three Tollywood Heroes Helped Jr Ntr For This Movie, Tollywood, Heros Help, Badh-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ లను గ్లోబల్ స్టార్ లుగా మార్చేసింది.ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచాయి.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Badh Shaa, Heros, Jr Ntr, Mahesh Babu, Ram Charan, Tollywoodheroes, Tolly

ఈ సినిమాతో పాటు వార్ 2సినిమాలో ( War 2 movie )కూడా నటిస్తున్నారు ఎన్టీఆర్.ఆ సంగతి పక్కన పెడితే మామూలుగా సెలబ్రిటీలకు వారి కెరియర్ లో కొన్ని కొన్ని తీపి జ్ఞాపకాలు మధురమైన మరిచిపోలేని అనుభూతులు ఉంటాయి.అలా ఎన్టీఆర్ కి కూడా ఒక చిత్రంతో మరిచిపోలేని అనుభూతి ఉందట.ఆ చిత్రం మరేదో కాదు బాద్ షా( Bad Shah ).శ్రీను వైట్ల దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ తో పాటు బ్రహ్మానందం కామెడీ కూడా బాగా హైలెట్ అయింది.

అయితే ఈ చిత్రం గురించి ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్న ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సినిమా కోసం ముగ్గురు స్టార్ హీరోలు తమ వంతు సహాయాన్ని అందించారు.

Telugu Badh Shaa, Heros, Jr Ntr, Mahesh Babu, Ram Charan, Tollywoodheroes, Tolly

అది కూడా ఏమీ ఆశించకుండా అని తెలిపారు తారక్.ఈ సినిమా ఓపెనింగ్ కి హీరో రామ్ చరణ్( Hero Ram Charan ) హాజరై ఎన్టీఆర్ ఫస్ట్ క్లాప్ ను ఇచ్చారట.అలా ఈ సినిమా మొదట రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభమైందట. సూపర్ స్టార్ మహేష్ బాబు ( Superstar Mahesh Babu )ఈ సినిమాకు ఓవర్ వాయిస్ ని అందించారట.

అలాగే ఈ చిత్రానికి తనవంతు సాయం చేసిన మరో హీరో సిద్దార్థ్.( Siddharth ) సిద్దార్థ్ ఈ చిత్రంలో కామియో రోల్ పోషించిన సంగతి తెలిసిందే.

నా మీద ఉన్న ఇష్టంతో సిద్దార్థ్ ఆ రోల్ చేశాడు అని తారక్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube