జబర్దస్త్ కి ధీటుగా పోటీ ఇస్తున్న అదిరింది...

తెలుగులో ప్రస్తుతం కామెడీ షోల హవా నడుస్తోంది.

ఈ కామెడీ షోల్లో ప్రతి గురు, శుక్రవారాల్లో ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.

అంతేగాక గత కొద్ది సంవత్సరాలుగా జబర్దస్త్ కి పోటీ ఇచ్చే సరైన కామెడీ షో లేక కామెడీ షోలకు రారాజుగా జబర్దస్త్ వెలుగొందింది.అయితే ప్రస్తుతం ఈ కామెడీ షో కి జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమయ్యే అదిరింది కామెడీ షో మంచి పోటీని ఇస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.

అయితే టెలివిజన్ టిఆర్పి పరంగానే కాకుండా యూట్యూబ్ లో కూడా అదిరింది కామెడీ స్కిట్లకి మంచి స్పందన లభిస్తోంది.అయితే ఇందుకు గల కారణాలు లేకపోలేదు.

గతంలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో నటించినటువంటి కమెడియన్లు ఒక్కసారిగా అదిరింది షోలో చేయడం మొదలుపెట్టారు. దీంతో పాత ఫార్ములా అయినప్పటికీ కొత్తగా అలరిస్తోంది.

Advertisement

అంతేగాక ప్రముఖ జబర్దస్త్ షోలో చేస్తున్నటువంటి మెగా హీరో నాగబాబు కూడా అదిరింది షోలో ప్రస్తుతం జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.అయితే జబర్దస్త్ షో కి వెన్నెముకగా నిలిచిన టువంటి నాగబాబు ఒక్కసారిగా మానేసి అదిరింది షోలో చేయడం, అలాగే జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న టువంటి కమెడియన్లు అదిరింది షోలో పాల్గొనడం ఇవన్నీ  అదిరింది షోకి బాగానే కలిసి వచ్చాయి.

దీంతో ప్రస్తుతం అదిరింది షో జబర్దస్త్ షోకి గట్టి పోటీని ఇస్తోంది.

అయితే ఇది ఇలా ఉండగా గతంలో డి డాన్స్ షోకి కూడా జీతెలుగు లోని ఆట, మరియు ఇతర డాన్స్ సంబంధిత షోలు గట్టి పోటీని ఇచ్చినప్పటికీ డీ డాన్స్ షోని అందుకోలేక పోయాయి.కానీ ఈ సారి మాత్రం అదిరింది షో నిర్వాహకులు పథకం ప్రకారం ముందుకు వెళుతూ జబర్దస్త్ కామెడీ షోని బీట్ చేసే విధంగా ముందుకు సాగుతున్నారు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు