టీడీపీలో టిక్కెట్ కోసం మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్సీ

క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం తాజాగా తెర‌మీదికి వ‌చ్చింది.ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఆదినారాయ‌ణ రెడ్డి గెలుపొందా రు.

అయితే, టీడీపీ ఆక‌ర్ష్ ప్ర‌భావంతో ఆయ‌న పార్టీ జంప్ చేసి.ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు.

అంతేకాదు, బాబు ఆశీస్సుల‌తో ఆయ‌న మంత్రిగా కూడా చ‌లామ‌ణి అవుతున్నారు.అయితే, రాజ‌కీయంగా మాత్రం జ‌మ్మ‌ల‌మ‌డుగు తీవ్రంగా ర‌గిలిపోతోంది.

మరో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయి.ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున పార్టీకి అన్నీతానై వ్య‌వ‌హ‌రించిన ఎమ్మె్ల్సీ రామ‌సుబ్బారెడ్డికి, ఆదికి అస్స‌లు ప‌డడం లేదు.

Advertisement

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈటికెట్ ఎవ‌రికి ఇస్తార‌నే విష‌యంలోనే ఈ ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వివాదం తెర‌మీదికి వ‌చ్చింది.దీంతో ఇద్ద‌రు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు, ప‌త్యారోప‌ణ‌లు చేసుకుంటూ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు.వాస్త‌వానికి ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు, ఆరోప‌ణలు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి.

అయితే, అప్ప‌ట్లో ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న‌వారు ఇప్పుడు ఒకే గొడుగు కింద‌కు చేరారు.వాస్త‌వానికి ఆదిని టీడీపీలోకి చేర్చుకునే స‌మ‌యంలోనే రామ‌సుబ్బారెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించాడు.

అయితే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు రామ‌సుబ్బారెడ్డికి న‌చ్చ‌జెప్పి.పార్టీని బ‌లోపేతం చేయ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం అనే రెండు అంశాల ఆధారంగా ఆదిని పార్టీలోకి తీసుకుంటున్న‌ట్టు చెప్పారు.

అదేస‌మ‌యంలో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ సీటును ఇచ్చారు.దీంతో కొంత మెత్త‌బ‌డిన రామ సుబ్బారెడ్డి.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
వైరల్: రోడ్డుపై బైక్‌ స్టంట్స్.. ట్రక్కు ఎదురుగా వచ్చేసరికి?

త‌న ప‌నేదో తాను చేసుకుపోతున్నారు.అయితే, ఇంత‌లోనే మ‌రో ఏడాదిలో జ‌ర‌గ నున్న ఎన్నిక‌ల‌పై మంత్రి ఆది త‌న‌దైన శైలిలో స్పందించారు.

Advertisement

వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో తాను టీడీపీ త‌ర‌ఫున జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.ఈ ప్ర‌క‌ట‌నే మ‌రోసారి వివాదాన్ని తెర‌మీదికి తెచ్చింది.

ర‌గిలిపోయిన రామ‌సుబ్బారెడ్డి.ఆదిపై విరుచుకుప‌డ్డాడు.

‘జమ్మలమడుగులో పోటీ చేసేది తానే అని ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని హామీ ఇచ్చారు.ఎన్‌టీఆర్‌ హయాం నుంచి టీడీపీలో టికెట్స్‌ ప్రకటించే హక్కు మంత్రులకు, జిల్లా అధ్యక్షులకు లేదు.

పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నారు.లేని పోనీ ప్రకటనలు చేసి నియోజకవర్గంలో వర్గపోరు పెంచుతున్నారు’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడ్డారు.

వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి తాను పోటీ చేయాల‌ని రామ‌సుబ్బారెడ్డి భావిస్తున్నాడు.దీంతో ఇక్క‌డ త‌న‌కుపోటీగా మార‌తాడు కాబ‌ట్టే ఆదిని ఆయ‌న మొద‌టి నుంచివ్య‌తిరేకిస్తూ వ‌చ్చాడు.

అయితే, బాబు ఎలాంటి హామీ ఇచ్చాడో తెలియ‌దు కానీ.ఆయ‌న స‌ర్దుకు పోతున్నాడు.

కానీ, ఇంత‌లోనే ఆది చేసిన ప్ర‌క‌ట‌న ఇద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీవివాదాన్ని రాజేసింది.మ‌రి దీనిని బాబు ఎలా ప‌రిష్క‌రిస్తాడో చూడాలి.

తాజా వార్తలు