పాత సైకిల్ తో ఈ- సైకిల్ తయారు చేసిన మెకానిక్.. గంటన్నర ఛార్జింగ్ పెడితే చాలు.. ఏకంగా..?!

పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధన కర్చులేకుండా ఉపయోగించే వాహనం ఏదైనా ఉంది అంటే అది సైకిల్ మాత్రమే.

అంతేకాకుండా సైకిల్ ను ఉపయోగించడం వల్ల కాలుష్యం కూడా చాలా వరకు తగ్గుతుంది.

అయితే మారుతున్న కాలానుగుణంగా కార్లు, బస్ లు, స్కూటర్లు, ఆటోలు అంటూ రకరకాల వాహనాలు వచ్చేసాయి.దీంతో చాలా వరకు సైకిల్ వాడకం తగ్గిపోయింది.

ఇంట్లో ఉన్న సైకిల్ లు ఓ మూలన పడిపోతున్నాయి.అయితే కనుమరుగవుతున్న పాత సైకిల్ ను ఉపయోగించి ఓ మెకానిక్ ఛార్జింగ్ తో నడిచే ఈ- సైకిల్ తయారు చేసాడు.ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ జలీల్ కేవలం రూ.6,200 ఖర్చు పెట్టి పాత సైకిల్ ను విజయవంతంగా ఈ- సైకిల్ గా మార్చారు.20 ఏళ్లుగా బైక్ మెకానిక్ అనుభవం ఉన్న జలీల్ తన ఆలోచనతో పంటల పై రసాయన మందు పిచికారీ చేసే యంత్రంలో ఉపయోగించే 8.12 వోల్టుల రెండు బ్యాటరీలు, చైనా మోడల్ కిట్ (ఎక్స్ లేటర్, మోటార్) అమర్చి ఈ - సైకిల్ ను తయారు చేసినట్టు జలీల్ తెలిపారు.మొదటగా ఈ ప్రయోగం పాత సైకిల్ తో చేసినట్టు జలీల్ తెలిపారు.

అయితే ఈ- సైకిల్ కు గంటన్నర ఛార్జింగ్ పెడితే గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని ఆయన తెలిపారు.త్వరలో రూ.21000 తో నూతన సైకిల్ తో పాటు 40 కిలోమీటర్లు ప్రయాణించే సైకిల్ ను తయారు చేస్తానని చెప్పారు.అలాగే మధ్య వయసున్న పేద, మధ్య తరగతి వారు ఈ- సైకిల్ ను ఉపయోగించవచ్చునని తెలిపారు.

Advertisement
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన

తాజా వార్తలు