మేజర్ ఫస్ట్ లుక్ కి అనూహ్య స్పందన

ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో అడవి శేష్.రొటీన్ కి భిన్నంగా కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలని అడవి శేష్ చేస్తున్నాడు.

క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలతో సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు ఓ వైపు గూఢచారి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నాడు.

మరో వైపు ముంబై టెర్రర్ ఎటాక్స్ లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ టైటిల్ తో ఒక సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు, తమిళ్, హిందీ బాషలలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.లాక్ డౌన్ అనంతరం రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ని అడవి శేష్ టీం స్టార్ట్ చేసింది.

Advertisement

దర్శకుడు శశికిరణ్ అయిన మేజర్ సినిమాలో మేజర్ రోల్ మాత్రం హీరోదే కావడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని అడవి శేష్ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అఫీషియల్ ట్విట్టర్ లో లాంచ్ చేశారు.ఈ సందర్భంగా శేష్ కి మహేష్ బాబు బర్త్ డే విషెస్ చెప్పారు.గన్ పట్టుకొని ఎవరినో టార్గెట్ చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ లో రివీల్ చేశారు.

కథ పరంగా ముంబై టెర్రర్ ఎటాక్స్ కి సంబందించిన అంశం టచ్ చేస్తూ ఉండటంతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తూ ఉండటం వలన మహేష్ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో మేజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు.యూనిక్ గా లేకపోయిన టైటిల్ జస్టిఫై చేసే విధంగా ఫస్ట్ లుక్ ఉందనే అభిప్రాయం వినిపిస్తుంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు