ఇదే చెయ్యాలని రూల్ పెట్టుకోలేదు.. వచ్చిన సినిమా చేసుకుంటూ పోతున్నా!

శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ వర్ష బొల్లమ్మ జంటగా నటించిన తాజా చిత్రం స్టాండప్ రాహుల్.

ఈ సినిమాను నందకుమార్ అబ్బీనేని,భరత్‌ మాగులూరి నిర్మించారు.

ఈ సినిమా మార్చి 18న విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సినిమాలో శ్రేయ పాత్రలో నటించాను అని చెప్పుకొచ్చింది.ఈ సినిమాలో తన పాత్రకు స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకొచ్చింది వర్ష బొల్లమ్మ.

ఇక దర్శకుడు శాంటో మామూలు సమయంలో కూల్ గానే ఉన్నప్పటికీ సెట్ లో మాత్రం ఈ సినిమాపైనే దృష్టి పెడతాడు అని తెలిపింది.అంతేకాకుండా ఈ సినిమా నిర్మాతలు దర్శకునికి పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చి ఈ సినిమా అవుట్ పుట్ బాగా వచ్చేలా సహకరించారు అని తెలిపింది.

Advertisement

ఇక ఆయా ప్రాంతాలకు సంబంధించిన కల్చర్, భాష ను నేర్చుకోవడం తనకు ఎంతో ఇష్టం అని మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్, స్టాండప్‌ రాహుల్‌ చిత్రాలకు తెలుగులో తానే డబ్బింగ్‌ చెప్పాను అని చెప్పుకొచ్చింది వర్ష బొల్లమ్మ. అదేవిధంగా తనను చాలా మంది గ్లామర్ పాత్రలు చేయడం లేదు ఏంటి అని అడుగుతున్నారని, సినిమాలలో అలాంటి పాత్రలు చేయాలి అన్న రూల్ పెట్టుకోలేదని, వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతున్నాను అని తెలిపింది.

సినిమాలలో తన పాత్ర నిడివి ఎక్కువగా లేకపోయినా పాత్ర బలంగా ఉండాలనుకుంటాను అని తెలిపింది.ఇకపోతే ఆమె తాజాగా నటించిన స్టాండప్ రాహుల్ సినిమా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసి థియేటర్ల నుంచి నవ్వుతూ బయటకు వస్తారు అని తెలిపింది వర్ష బొల్లమ్మ. ఇకపోతే ప్రస్తుతం తాను తెలుగులో స్వాతి ముత్యం అనే సినిమా చేస్తున్నాను.

మరో సినిమాకి కూడా సంతకం చేశాను అని చెప్పు కొచ్చింది వర్ష బొల్లమ్మ.

ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 
Advertisement

తాజా వార్తలు