డబ్బుకు విలువ ఇచ్చే సినిమానే యశోద.. వరలక్ష్మి కామెంట్స్ వైరల్?

సమంత ప్రధాన పాత్రలో హరి హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం యశోద.

పాన్ ఇండియా స్థాయిలో సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ సినిమా నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.

ఈ సినిమాలో నా పాత్ర కామ్ గా ఉన్నట్టు అనిపించినప్పటికీ కథ సాగే కొద్ది నా పాత్ర కీలకంగా ఉండబోతుందని తెలిపారు.ఇందులో తాను గ్రేషేడ్స్ ఉన్న రోల్ చేశానని వరలక్ష్మి శరత్ కుమార్ వెల్లడించారు.

Advertisement

నా పాత్రకు సమంత పాత్రకు మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉందని ఈమె సినిమాలో తన పాత్ర గురించి తన పాత్ర ప్రాధాన్యత గురించి వెల్లడించారు.ఇక ఈ సినిమాలో తన పాత్ర ఒక ఛాలెంజింగ్ గా అనిపించిందని వరలక్ష్మి వెల్లడించారు.

ఇక ఈ సినిమా టెక్నికల్ పరంగా ఎంతో అద్భుతంగా వచ్చిందని సినిమాటోగ్రాఫర్ సుకుమార్ గారు అద్భుతంగా షూట్ చేశారంటూ ఈమె చెప్పకోచ్చారు.మణిశర్మ గారి సంగీతం సినిమాకి హైలైట్ కానుందని వరలక్ష్మి వెల్లడించారు.మొత్తానికి ఈ సినిమా టికెట్ కొనుగోలు చేసి మీరు సినిమాకు వెళ్తే మీరు పెట్టిన డబ్బుకు ఒక విలువ ఉంటుందని, సినిమాలో అంత మంచి కంటెంట్ ఉందని ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ యశోద సినిమా గురించి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు