ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఒకరి తర్వాత ఒకరోజు సెలబ్రిటీలు మరణిస్తూనే ఉన్నారు.
అయితే కొందరు అనారోగ్యం మరణిస్తుండగా మరి కొందరు ఆత్మహత్య చేసుకుని మరణిస్తున్నారు.ఒక సెలబ్రిటీ చనిపోయారు అని ఆ బాధ నుంచి తేరుకునే లోపే మరొక సెలబ్రిటీ చనిపోతున్నారు.
తాజాగా సిని ఇండస్ట్రీలో మరొక విషాదం చోటు చేసుకుంది.సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తుది శ్వాస విడిచారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.తాజాగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.
తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘురామ్ తాజాగా మరణించారు.ఇటీవలే కామెర్ల వ్యాధి బారిన పడిన రఘురామ్ చెన్నైలోని ఆసుపత్రిలో చేరాడు.ఇక తాజాగా చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.రఘురాం మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా తీవ్ర ద్రిగ్బాంతికి లోనయ్యింది.
రఘురాం మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు,స్నేహితులు, సన్నిహితులు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.రఘురాం మరింత ఒక్కసారిగా ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
రఘురామ్ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.మరణానికి కారణం కామెర్ల వ్యాధి అని తెలుస్తోంది.
రఘురామ్ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.ఇంత చిన్న వయసులోనే ఆయన మరణించడం చాలా మందిని తీవ్రంగా కలిచి వేస్తోంది.ఇకపోతే రఘురామ్ సినిమాల విషయానికొస్తే.మొదటి 2017 లో విడుదల అయినా ఒరు కిదైయిన్ కరుణై మను సినిమాకు సంగీతాన్ని అందించారు.ఆ తర్వాత 2011లో విడుదల అయిన రివైండ్, ఆసై లాంటి సినిమాలకు కూడా సంగీతాన్ని అందించారు.ఈ మూడు చిత్రాలకు సంగీతాన్ని అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉన్న రఘురామ్ ఈ విధంగా కామెర్ల బారినపడి ఇంత చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరం అని చెప్పవచ్చు.