పవర్ స్టార్ పవన్ అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు( Pawan kalyan ) సాధారణ అభిమానులతో పాటు సెలబ్రిటీలలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

పవన్ ప్రస్తుతం నటిస్తున్న ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ రెండు సినిమాలు 2025 సంవత్సరంలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది.ఓజీ సినిమాలో( OG Movie ) శ్రియారెడ్డి( Sriya Reddy ) కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

శ్రియారెడ్డి మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలం నాకు ఎంతో ప్రత్యేకమని ఆమె తెలిపారు.సలార్ మూవీలో( Salaar ) నా రోల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని శ్రియారెడ్డి పేర్కొన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటైన ఓజీ మూవీలో వర్క్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement

ఈ ఏడాది కాలంలో నన్ను నేను పునర్నిర్మించుకున్నానని ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం నా చేతిలో ఓజీ మాత్రమే ఉందని కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని శ్రియారెడ్డి వెల్లడించారు.ఓజీలో నా రోల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని శ్రియారెడ్డి పేర్కొన్నారు.

సలార్ లోని పాత్రకు, ఓజీ సినిమాలోని పాత్రకు సంబంధం ఉండదని ఆమె చెప్పుకొచ్చారు.

పవన్ కాంబోలో ఇప్పటికే కొన్ని సీన్లు చేశానని శ్రియారెడ్డి తెలిపారు.పవన్ మర్యాద గల వ్యక్తి అని తెలివైన వ్యక్తి అని శ్రియారెడ్డి పేర్కొన్నారు.పవన్ ఇతరులతో మాట్లాడే విధానం చూడచక్కగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

ఓజీ సినిమాతో శ్రియారెడ్డికి మంచి పేరు వస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ నటికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

బన్నీ పక్కన ఉన్న ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా.. ఈమె టాలెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!
భారీ స్థాయిలో వ్యూస్ కైవసం చేసుకున్న బిగ్ బాస్ 8 ఫినాలే... నాగార్జున పోస్ట్ వైరల్!

ఓజీ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.షూటింగ్ పూర్తైతే ఈ సినిమా గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

శ్రియారెడ్డి పారితోషికం కూడా ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.

తాజా వార్తలు