సమంతని ఇంప్రెస్ చేసిన కథ..!

ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాల సెలక్షన్స్ లో ఆచితూచి అడుగులేస్తున్న సమంత. జాను తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి గుణశేఖర్ తో శాకుంతలం సినిమా చేస్తుంది.

మైథలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమాలో సమంత తన నటనతో అందరిని మెప్పిస్తుందని అంటున్నారు.ఇక ఈ సినిమాతో పాటుగా తమిళం లో ఒక సినిమా చేస్తుంది అమ్మడు.

లేటెస్ట్ గా సమంత ఒక కథను ఓకే చేసిందని ఫిల్మ్ నగర్ టాక్.నూతన దర్శకుడు చెప్పిన ఫీమేల్ సెంట్రిక్ కథకు సమంత ఫిదా అయ్యిందని తెలుస్తుంది.

సినిమా జోనర్ ఏంటి.ఎవరు నిర్మిస్తున్నారు అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

సమంతని ఇంప్రెస్ చేసిన కథ అంటే.తప్పకుండా సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు.

పెళ్లి తర్వాత కథల విషయంలో ఏరి కోరి సెలెక్ట్ చేస్తున్న సమంత తన సత్తా చాటాలని చూస్తుంది.లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సమంత కొత్త కథలతో వస్తుంది.

అయితే కమర్షియల్ సినిమాలను చేస్తానని అంటున్నా ఆమె ఇమేజ్ కు తగిన పాత్రలు రావడం లేదని తెలుస్తుంది.

  అందుకే సమంత మొదటి ప్రిఫరెన్స్ కథా ప్రాధాన్యత ఉన్న ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకే ఇస్తుందని అంటున్నారు.సమంత కొత్త సినిమాకు సంబందించిన డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు