రమ్యకృష్ణ ఫ్యామిలీ లో ఇద్దరు ముఖ్యమంత్రులను భయపెట్ట గల ఆ వ్యక్తి ఎవరు..?

సంకీర్తన సినిమాలో కీర్తన వంటి సౌమ్యమైన పాత్ర అయినా, నరసింహ సినిమాలో నీలాంబరి వంటి పొగరుబోతు లేడీ కేరెక్టర్ అయినా, అమ్మవారి పాత్ర అయినా, అత్త కేరెక్టర్ అయినా, రాజమాత శివగామి కేరెక్టర్ అయినా ఏ పాత్ర అయినా అవలీలగా చేయగల గొప్ప నటి రమ్యకృష్ణ.

"ఇది నా మాట నా మాటే శాసనం" అంటూ శివగామిగా నట విశ్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రమ్యకృష్ణ నిజ జీవితంలో కూడా అలానే ఉంటారు.

చాలా మంది ఆమె పొగరుగా ఉంటారనుకుంటారు కానీ నిజానికి అది పొగరు కాదు, ఆమె ఆత్మవిశ్వాసం.ముక్కుసూటిగా ఉంటారు, తాను చేయాలనుకున్నది చేస్తారు.

మాటంటే మాటే.ఏ విషయంలో అయినా ఖచ్చితంగా ఉంటారు.

ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ కృష్ణవంశీని పెళ్లి చేసుకోవాలన్నా, మనస్పర్ధలు వచ్చి కృష్ణవంశీతో విడిపోయిన తర్వాత ఒంటరిగా బతకాలన్న ఆమెకే చెల్లింది.ఆమె దేనికీ భయపడరు రమ్యకృష్ణకి ఒక కొడుకు కూడా ఉన్నాడు.

Advertisement

ఈమె చెన్నైలోనే ఉంటున్నారు.

అయితే రమ్యకృష్ణ ఇంత మొండిగా, ధైర్యంగా ఉండడానికి గల కారణం ఆమె కుటుంబ నేపధ్యమే.ఈమె తమిళ నాట సుప్రసిద్ధ నటుడయిన చో రామస్వామి మేనకోడలు. చో రామస్వామి అంటే తెలుగులో తెలియకపోవచ్చు కానీ తమిళనాడులో ఫేమస్ పర్సనాలిటీ.

సినిమా నటుడుగా, సినీ రచయితగా, నాటక రచయితగా, పత్రికా రచయితగా, డైరెక్టర్ గా, న్యాయవాదిగా ఇలా మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.అప్పట్లో ఈయన రాజకీయ నాయకుల మీద సెటైర్లు వేసేవారు.

అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమెని విమర్శిస్తూ "మహమ్మద్ బిన్ తుగ్లక్" అనే నాటకాన్ని రచించి ప్రదర్శించారు.ఆ తర్వాత కూడా 2 వేల సార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఈ నాటకం అప్పట్లో పెద్ద సక్సెస్ కావడంతో జనాల్లో ఒక బ్రాండ్ గా నిలిచిపోయింది.దీంతో 1970 లో తుగ్లక్ అనే పత్రికను స్థాపించారు.పత్రిక ముఖచిత్రం మీద రాజకీయాలకు సంబంధించిన కార్టూన్లు మాత్రమే ఉంటాయి.

Advertisement

ఈయన పేరు వింటే ఎంజిఆర్, జయలలిత వంటి రాజకీయ నాయకులు భయపడతారు.ఒకరకంగా చెప్పాలంటే జయలలితకు ఈయనంటే గౌరవం.

అందుకే ఆయన ఎన్ని విమర్శలు చేసినా తన శ్రేయోభిలాషి ఆమె మంచి కోసం చెబుతున్నట్టే తీసుకునేవారు.అయితే జయలలిత ఎవరి మాటా వినేవారు కాదు, కానీ రామస్వామి మాట మాత్రం వినేవారు.రామస్వామి ఇచ్చిన సలహాలను పాటించేవారు.

జయలలిత సలహాదారుడుగా ఉంటూనే ఆమె చేసిన అవినీతిని కూడా ఎండగట్టారు.అలా ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా, ఏ పార్టీలో తప్పులు జరిగినా ఉన్నది ఉన్నట్టు విమర్శలు చేసేవారు.

తన తుగ్లక్ పత్రిక ద్వారా, స్వయంగా రాజకీయాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు.తుగ్లక్ పత్రిక ద్వారా సంపాదకీయుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈయన డిసెంబర్ 7 న 2016 లో మరణించారు.

అయితే ఈయన మాటలకు విలువ ఇచ్చే జయలలిత కూడా అదే సంవత్సరంలో రెండు రోజుల ముందు అంటే డిసెంబర్ 5 న మరణించారు.అదండి, చో రామస్వామి ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు కాబట్టే రమ్యకృష్ణ కూడా అలానే ఉంటారు.

మేనమామ పోలికలు మేనకోడలికి రాకుండా ఎక్కడకి పోతాయ్ చెప్పండి.

తాజా వార్తలు