ఒక వీధి కుక్క అడవి సింహాన్ని భయపెట్టి తన ప్రాణాలను కాపాడుకోగలిగింది.ఆ కుక్క కంటే సింహం రెండు రెట్లు ఎక్కువ పొడవు నాలుగు రెట్లు ఎక్కువ బరువు ఉన్నట్టు తెలుస్తోంది.
అయినా కూడా కుక్క ఏ మాత్రం భయపడకుండా సింహాన్ని భయపెట్టి ఎలాగోలా తప్పించుకోగలిగింది.సాధారణంగా సింహాలు చాలా క్రూరమైనవి కాబట్టి అవి ఏ జంతువునైనా క్షణాల్లో చంపి తినేస్తుంటాయి.
పులులు, ఏనుగులు మొసళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత శక్తివంతమైనవైన జంతువుల అయినా సరే సింహాలు ముందు దిగదుడుపే.సింహానికి ఎదురు గా వెళ్తే ఇక ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవడమే.
అందుకే ప్రాణాంతకమైన పరిస్థితులను “సింహం నోట్లో తల పెట్టినట్టే” అనే సామెత తో పోలుస్తుంటారు.అయితే పైన చెప్పుకున్నట్టు ఓ వీధి కుక్క శక్తివంతమైన సింహం దాడి నుంచి ఎస్కేప్ అయ్యి ప్రతి దాడి చేసి వావ్ అనిపించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.గుజరాత్లోని ససన్ అడవిలో జంగిల్ సఫారీ కి కొంత మంది పర్యాటకులు వెళ్లారు.అయితే అక్కడ పర్యాటకులకు ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది.అదేంటంటే ఒంటరిగా ఉన్న ఒక కుక్క పై ఒక ఆడ సింహం మెరుపువేగంతో దాడి చేసింది.అయితే సింహం నోటికి తన తలను దొరకనివ్వకుండా కుక్క తప్పించుకుంది.అనంతరం ఆ దాడి నుంచి తేరుకొని గట్టిగా అరుస్తూ సింహాన్ని బాగా భయపెట్టింది.
సింహాన్ని కరవడానికి కూడా ప్రయత్నించింది.ఆ తర్వాత వెనుదిరిగి వెళ్లగా సింహం ఆ కుక్క వెనుకే వచ్చి దానిపై మళ్ళీ దాడి చేయాలని ప్రయత్నించింది.
కానీ కుక్క మాత్రం ధైర్యంగా నీ ప్రతాపమా నా ప్రతాపమా అన్న రీతిలో సింహం పై ఎదురుదాడికి దిగింది.సింహం మొహం పై కాటు వేయడానికి పైకి ఎగిరింది.
దీనితో సింహం ఎటాక్ మోడ్ నుంచి డిఫెన్స్ మోడ్ కి వచ్చింది.అనంతరం కుక్క సింహం పై ఒక కన్నేసి దాని నుంచి దూరంగా వెళ్ళిపోయింది.
సింహం కూడా కుక్క చేసే పోరాటానికి భయపడి దాని జోలికి వెళ్లలేదు.దీంతో కుక్క తన ప్రాణాలను కాపాడుకుంది.
అయితే ఈ దృశ్యాలను కెమెరాలో బంధించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు టూరిస్టులు.దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.