అబార్షన్ జరగడంతో మానసికంగా కృంగిపోయా.. నమిత షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరోయిన్ నమిత గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత( Namitha ).

మొదట సొంతం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది నమిత.

ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించింది.ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఈ సినిమా తర్వాత జెమిని, నాయకుడు, బిల్లా, సింహా లాంటి తెలుగు సినిమాలలో నటించింది.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ మలయాళ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి పాపులారీటీ తెచ్చుకుంది నమిత.కాగా 2020లో మాయ అనే తమిళ సినిమాలో చివరిసారిగా కనిపించిన నమిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

Advertisement

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.ప్రెగ్నెన్సీ విషయంలో తన కు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.2021లో మొదటిసారి గర్భం ధరించాను.ఆ సమయంలో నేను సూరత్‌లో ఉన్నాను.

నాతో పాటు అమ్మానాన్నలు కూడా ఉన్నారు.కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు.నాలుగు నెలలకే గర్భస్రావం అయింది.

దాంతో నేను తీవ్రమైన డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయాను.అయితే అదృష్టవశాత్తూ ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్‌ అయ్యాను అని చెప్పుకొచ్చిందీ నమిత.

కాగా నమిత 2017లో బిజినెస్ మాన్ వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ దంపతులకు 2022లో ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?
పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రస్తుతం తన పిల్లలతో భర్తతో కలిసి సంతోషంగా గడుపుతూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది నమిత.

Advertisement

తాజా వార్తలు