అలా నటించినందుకు తర్వాత బాధపడ్డా.. నటి మాళవిక షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా నటిగా మాళవిక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తెలుగులో చాలా బాగుంది సినిమాతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మాళవిక ఆ తర్వాత దీవించండి, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, శుభకార్యం సినిమాలలో నటించారు.

తాజాగా మాళవిక అలీతో సరదాగా షోకు హాజరయ్యారు.ఈ షో ప్రోమోలో మాళవిక ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన అసలు పేరు శ్వేతా కొన్నూర్ మీనన్ అని ఆమె అన్నారు.తెలుగు సినిమాలలో నటించి 12 సంవత్సరాలు అవుతోందని ఆమె చెప్పుకొచ్చారు.

తెలుగులో 5 సినిమాలే చేసిన తాను తమిళంలో మాత్రం 35 సినిమాలలో నటించానని మాళవిక చెప్పుకొచ్చారు.కాలేజ్ లో చదువుకునే సమయంలో క్లాస్ రూమ్ తో పోలిస్తే క్యాంటీన్ లోనే ఎక్కువగా ఉండేదానినని ఆమె అన్నారు.

Advertisement
Actress Malavika Alitho Saradaga Promo Goes Viral In Social Media Details, Actre

క్యాంటీన్ లో బన్, సమోసాలను తాను ఎంతో ఇష్టంగా తినేదానినని ఆమె కామెంట్లు చేశారు.కెరీర్ తొలినాళ్లలో తనను అందరూ సన్నీ డియోల్ ఆఫ్ సౌత్ అని పిలిచేవారని ఆమె తెలిపారు.

Actress Malavika Alitho Saradaga Promo Goes Viral In Social Media Details, Actre

నాగార్జున, విజయ్ దేవరకొండ టాలీవుడ్ హీరోలలో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు.చాలా బాగుంది మూవీ షూటింగ్ టైమ్ లో శ్రీకాంత్ తో ఫైట్ అయిందని మాళవిక తెలిపారు.రొమాంటిక్ సాంగ్ లో తనకు కంఫర్ట్ లేదని చెప్పగా శ్రీకాంత్ వెళ్లిపోయాడని ఆమె అన్నారు.

ఇప్పటికి కూడా తనకు లవ్ లెటర్స్ వస్తాయని ఆమె వెల్లడించారు.

Actress Malavika Alitho Saradaga Promo Goes Viral In Social Media Details, Actre

చంద్రముఖి సమయంలో రజనీకాంత్ తో డైలాగ్ చెప్పడానికి ఇబ్బంది పడ్డానని ఆమె అన్నారు.తాజాగా తాను పుష్ప మూవీ చూశానని ఆ సినిమాలోని ఊ అంటావా సాంగ్ లో ఆఫర్ వస్తే చేసేదానినని ఆమె తెలిపారు.చాలా బాగుంది సినిమాలో రేప్ సీన్ చాలా డిస్టర్బింగ్ గా అనిపించిందని ఆమె తెలిపారు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?

హిందీలో సీయు ఎట్ 9 సినిమాలో తాను నటించగా ఆ సినిమాలోని బోల్డ్ సీన్లను చూసి తల్లిదండ్రులు కోప్పడ్డారని ఆ సినిమా ఎందుకు చేశానా అని తాను భావిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు