నాగబాబుకి కూడా ఒక కూతురు ఉంది మర్చిపోయారా.. కౌంటర్ ఇచ్చిన మాధవీ లత!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్( Jani Master ) వ్యవహారం సంచలనంగా మారింది.

ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ స్వయంగా ఒప్పుకోవడంతో తనకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది బాదిత మహిళకు అండగా నిలుస్తూ జానీ మాస్టర్ పై విమర్శలు చేయడం మరికొందరు మాత్రం జానీ మాస్టర్ కు మద్దతు తెలుపుతూ వస్తున్నారు.ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు జానీ మాస్టర్ కు మద్దతుగా నిలబడి ఒకవైపు నుంచి ఆలోచించకూడదు, వచ్చే ఆరోపణలన్ని నిజం కావాలని లేదు కదా అంటూ విభిన్న రకాలుగా మద్దతు తెలిపారు.

ఇలా మద్దతు తెలిపిన వారిలో నాగబాబు( Nagababu ) కూడా ఒకరు.మెగా ఫ్యామిలీకి జానీ మాస్టర్ ఎంతో సన్నిహితుడనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే జానీ మాస్టర్ గురించి ఆయన పరోక్షంగా చేసిన ఈ పోస్ట్ పలు విమర్శలకు కారణమైంది.

ఈ క్రమంలోనే సినీ నటి మాధవీ లత( Madhavi Latha ) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.ఇందులో భాగంగా జానీ మాస్టర్ కు మద్దతు తెలుపుతున్న వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

Advertisement

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మెగా బ్రదర్ నాగబాబు జానీ మాస్టర్ కు సపోర్ట్ చేయడంతో తాను చాలా బాధపడ్డానని తెలిపారు.నాగబాబుకి కూడా ఒక కూతురు ఉంది కదా ఆ విషయం మర్చిపోయారా పైగా తన కూతురి కంటే వయసులో బాధిత మహిళ చాలా చిన్నది.

ఇక మహాసేన రాజేష్( Mahasena Rajesh ) అనే వ్యక్తి సైతం జానీ మాస్టర్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ.ఫాలోవర్స్ ని తప్పుదారి పట్టిస్తున్నాడు.ముఖ్యంగా ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన ఈ విషయం పట్ల ఎందుకంత నిర్లక్ష్యం అని ప్రశ్నించారు.

మీరు జానీ మాస్టర్ తో పని చేయడం వల్ల ఆయన మీకు మంచి వాడు కావచ్చు కానీ అమ్మాయికి కాదు అని తెలిపారు.ఒక అమ్మాయిని తన ఇష్టం లేకుండా ఎవరు తాకకూడదని, అది పూర్తిగా తప్పేనని ఈమె నాగబాబుతో పాటు ట్రోలర్స్ కి సైతం కౌంటర్ ఇచ్చారు.

అంతేకాకుండా బాదిత మహిళకు అండగా నిలుస్తానని మాధవీ లత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్
Advertisement

తాజా వార్తలు