మహాశివరాత్రి పండుగ సందర్భంగా థియేటర్ల ముందుకు వచ్చిన జాతి రత్నాలు సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.సినిమా విడుదలయి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్లలో ఏ మాత్రం తగ్గకుండా, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఎంతో అద్భుతంగా నటించిన ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వుకున్నారు.ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది.
కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా జాతిరత్నాలు సినిమా తన హవాను కొనసాగిస్తోంది.
సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ మూవీ గురించి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.
టాలీవుడ్ హీరో అయినా మహేష్ బాబు,అల్లుఅర్జున్లాంటి వాళ్ళు ఈ సినిమా చూసి ఇలాంటి అద్భుతమైన సినిమా చూడక చాలా రోజులైంది , జగిత్యాల సినిమాలో గుర్తు చేశారంటూ ఈ సినిమా గురించి మహేష్ బాబు రివ్యూ ఇచ్చారు.ఎంతో అద్భుతంగా సాగే ఈ సినిమాలో చివరలో కెమెరా అప్పియరెన్స్ పై మహానటి కీర్తి సురేష్ కనిపిస్తారు.
నవీన్ కాలేజీ లవర్ గా వనజాక్షి పాత్రలో కీర్తిసురేష్ నటించారు.

అయితే తాజాగా ఈ విషయం గురించి కీర్తి సురేష్ స్పందించారు.తన ప్రోమో స్క్రీన్ షాట్ ను ఇంస్టా రీల్ లో పోస్ట్ చేసిన కీర్తి సురేష్ చాలా సంతోషంగా ఉంది.ముందుగా జాతిరత్నాలు టీమ్ కి కంగ్రాట్స్ తెలిపారు.
ఈ నవ్వుల సునామీలో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ కీర్తి సురేష్ తెలియజేశారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి విడుదలకు సిద్ధంగా ఉంది.
అదే విధంగా ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన, దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారీ వారి పాట చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ ప్లస్,మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది.