ఆ బాబాను నమ్మి మోసపోయానంటున్న సినీ నటి

దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు, లైంగిక వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యాచార ఘటనల సంఖ్యను తగ్గించడానికి కొత్త చట్టాలను అమలులోకి తెస్తున్నాయి.

అయితే ఎన్ని చట్టాలు అమలులోకి వచ్చినా అత్యాచార ఘటనలు, వేధింపుల ఘటనలు తగ్గడం లేదు.తాజాగా ప్రముఖ సినీనటి బాబాను నమ్మి మోసపోయానని చెప్పారు.

సినీనటి అనుప్రియ గోయెంకా తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.అశ్రమ్ 2 వెబ్ సిరీస్ లో నటించిన అనుప్రియ వెబ్ సిరీస్ ప్రమోషన్ల కోసం మీడియా సమావేశాలకు హాజరవుతూ ఆ సమావేశాల్లో తనకు జీవితంలో ఎదురైన అనుభవాల గురించి వెల్లడించారు.

తను యుక్త వయస్సులో ఉన్న సమయంలో తమ కుటుంబం ఒక బాబాను ఎక్కువగా నమ్మేదానినని.ఆ బాబా తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సినీనటి చెప్పుకొచ్చారు.

Advertisement

తమ కుటుంబానికి దైవ భక్తి ఎక్కువని.బాబా చెప్పిన సలహాలు, సూచనలను పాటించి తమ కుటుంబం నడుచుకునేదని.మొదట్లో తనకు ఆ బాబాపై నమ్మకం లేకపోయినా తర్వాత తను కూడా బాబాను నమ్మడం మొదలుపెట్టానని అయితే బాబా తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతని నిజస్వరూపం తనకు అర్థమైందని తెలిపారు.

తనకు 18 సంవత్సరాలు ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు.తాను ఎంతగానో నమ్మిన బాబా అసభ్యంగా ప్రవర్తించడంతో తనకు ఎంతగానో భయమేసిందని.ఆ సమయంలో ఏం చేయాలో కూడా తనకు అర్థం కాలేదని తెలిపారు.

ధైర్యం చేసి కుటుంబ సభ్యులకు ఆ బాబా నిజస్వరూపం గురించి చెప్పేశానని.ఆ బాబా లాంటి వ్యక్తులు ఎంతోమంది జీవితంలో ఎదురయ్యారని అనుప్రియ అన్నారు.

ఆ ఘటన అనంతరం ఆ బాబాకు తనతో పాటు కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారని.ఆ ఘటనను తలచుకుంటే ఇప్పటికీ చిరాకు వేస్తుందని అనుప్రియ వెల్లడించారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు