సోనూసూద్ అన్ని లక్షల మందికి సహాయం చేశారా..?

రియల్ హీరో సోనూసూద్ దేశంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయం చేస్తున్నారు.

తెరపై విలన్ రోల్స్ చేసినా నిజ జీవితంలో మాత్రం తాను విలన్ కాదని హీరోనని సోనూసూద్ ప్రూవ్ చేసుకుంటున్నారు.

గతేడాది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చడం నుంచి సోనూసూద్ సేవా కార్యక్రమాలు మొదలు కాగా నేటికీ ఆ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సోనూసూద్ తాను కూడా సామాన్యుడినేనని పేర్కొన్నారు.

తానే ఎందుకు సహాయం చేయకూడదని తనకు అనిపించిందని ప్రభుత్వాలను ప్రశ్నించడం కంటే పని చేయడమే మంచిది అని తాను నిర్ణయం తీసుకున్నానని సోనూసూద్ చెప్పుకొచ్చారు.ఇంట్లో కూర్చుని మాటలు మాట్లాడితే పనులు జరగవని రోడ్లపైకి వస్తే మాత్రమే పనులు జరుగుతాయని సోనూసూద్ అన్నారు.

చాలామంది ఎవరైనా మంచి పనులు చేస్తే రాజకీయాల్లోకి రావడం కోసమే ఆ పనులు చేస్తుంటారని అనుకుంటారని సోనూసూద్ చెప్పుకొచ్చారు.

Real Hero Sonusood Helping For 10 Lakh Members In Past 18 Months, 10 Lakh People
Advertisement
Real Hero Sonusood Helping For 10 Lakh Members In Past 18 Months, 10 Lakh People

తాను ఇప్పటివరకు పది లక్షల మందికి సహాయం చేశానని సోనూసూద్ తెలిపారు.నటుడిగా తాను ఎన్నో విజయాలు సాధించాల్సి ఉందని సోనూసూద్ చెప్పుకొచ్చారు.నటుడిగా తాను ఎంతో సంతోషంగా ఉన్నానని కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత కూడా తన పని తాను చేసుకుంటూ వచ్చానని సోనూసూద్ తెలిపారు.

తనకంటూ ఒక లక్ష్యం ఉందని తాను ఆ దారిలోనే వెళతానని సోనూసూద్ చెప్పుకొచ్చారు.

Real Hero Sonusood Helping For 10 Lakh Members In Past 18 Months, 10 Lakh People

కరోనా సోకిన ఐదు రోజుల్లోనే తనకు నెగిటివ్ వచ్చిందని కరోనా వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవడం వల్లే తాను త్వరగా కోలుకున్నానని సోషల్ మీడియాలో ఇచ్చే సమాధానాలు అన్నీ తాను ఇచ్చే సమాధానాలేనని సోనూసూద్ తెలిపారు.తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసుకున్నానని సోనూసూద్ వెల్లడించారు.సోనూసూద్ సొంత డబ్బును ప్రజల కోసం ఖర్చు చేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు