ఉదయ్ కిరణ్ పై కోపంతో సినిమా చేశాను... జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే: రవిబాబు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా డైరెక్టర్ గా రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రవిబాబు( Ravi Babu ) ఒకరు.

ఈయన ఎన్నో హర్రర్ సినిమాలకు డైరెక్టర్ గా పని చేసిన సంగతి తెలిసిందే.

అలాగే నటుడుగా రచయితగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో సోగ్గాడు ( Soggaadu ) సినిమా కూడా ఒకటి.

ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ ( Arthi Aggarwal ) తరుణ్ ( Tharun ) హీరో హీరోయిన్లుగా నటించారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ నేను తన జీవితంలో ఈగో హర్ట్ అయ్యి, పౌరుషంగా తీసుకున్నటువంటి నిర్ణయం సోగ్గాడు సినిమా చేయటం ఈ సినిమా చేసి నేను పెద్ద తప్పు చేశాను అంటూ ఈ సందర్భంగా రవిబాబు వెల్లడించారు.ఇక ఈ సినిమాలో ముందుగా తరుణ్ అలాగే ఉదయ్ కిరణ్ ఇద్దరు హీరోలు అని భావించాము ఇలా ఇద్దరు హీరోలు అయితేనే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని అప్పట్లో ఇద్దరు హీరోలు కూడా మంచి ఫేమ్ లవర్ బాయ్స్ గా గుర్తింపు పొందడంతో ఈ సినిమా కథకు అద్భుతంగా సెట్ అవుతారని భావించి తరుణ్ ఆర్తి అగర్వాల్ కలిసి వారికి కథ చెప్పి ఫైనల్ చేసాము.

Advertisement

ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) కి కూడా ఈ సినిమా కథ చెప్పాము.

ఈ సినిమా విషయంలో ఉదయ్ కిరణ్ మాకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఒకరోజు సినిమాలో నటిస్తానని చెబుతారు మరొక రోజు నటించనని చెబుతారు.ఇలా ఆయన నుంచి మాకు ఏ విధమైనటువంటి క్లారిటీ లేదు అయితే ఒక రోజు ఉదయ్ కిరణ్ ని కలవగా నేను ఈ సినిమాలో నటిస్తానని చెప్పారు.

ఉదయ్ అలా చెప్పడంతో సురేష్ బాబు గారికి నేను ఫోన్ చేసి ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో నటిస్తారు రేపు మనం ఆఫీసులో కలుస్తాం సార్ అని చెప్పి మాట్లాడాను.ఇక ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఉదయ్ కిరణ్ వచ్చి నేను ఈ సినిమాలో నటించనని చెప్పారు.

ఇలా ఉదయ్ కిరణ్ నటించిన అని చెప్పేసరికి నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది దీంతో నువ్వు నటించకపోతే వేరే ఎవరు నటించారా అన్న కారణంగా నేను బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తిని ఈ సినిమాలో పెట్టాను దీంతో సినిమా బ్యాలెన్స్ తప్పిందని, ఆయన స్థానంలో ఉదయ్ కిరణ్ నటించి ఉంటే సినిమా క్లైమాక్స్ మరో లెవెల్ లో ఉండేది ఇక ఉదయ్ కిరణ్ లేకపోవడంతో తప్పనిసరిగా ఈమె తరుణ్ పెళ్లి చేసుకుంటుంది తన ప్రేమనే అంగీకరిస్తుంది అనే విషయం అందరికీ పూర్తిగా అర్థం అయింది.దీంతో సినిమాపై భారీగా దెబ్బ పడింది అని రవిబాబు వెల్లడించారు.కేవలం ఈ సినిమా నేను ఉదయ్ కిరణ్ పై ఉన్నటువంటి కోపంతో చేశానని అయితే జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని నాకు ఈ సినిమా చేసిన తర్వాతే అర్థమైంది అంటూ రవిబాబు వెల్లడించారు.

ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!
Advertisement
https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=315818647750500

తాజా వార్తలు