షూటింగ్‌లో పెద్ద ప్రమాదం.. 8 కుట్లు పడ్డా మళ్లీ సెట్‌లోకి వచ్చి?

ఒకప్పుడు సినిమా షూటింగ్ లో ఏవైనా కష్టతరమైన, ప్రమాదకరమైన సన్నివేశాలను చిత్రీకరించాలంటే నటీనటుల స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేశాలను తెరకెక్కించే వారు.

కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్స్ సెలబ్రిటీస్ డూప్ లేకుండా ఎంతో ప్రమాదకరమైన సన్నివేశాలలో పాల్గొంటూ సాహసాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు షూటింగ్ సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు.ఈ మధ్యకాలంలో షూటింగ్ సమయంలో గాయపడుతున్న సెలబ్రిటీస్ సంఖ్య పెరిగిపోతోంది.

తాజాగా మరొక నటుడుకి కూడా షూటింగ్ లో పెద్ద ప్రమాదం జరగడంతో ఏకంగా 8 కుట్లు పడిన ఘటన చోటుచేసుకుంది.నటుడుగా, దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న చేరన్ ప్రస్తుతం నంద పెరియాస్వామి ద‌ర్శ‌క‌త్వంలో క‌డ‌లి ఫేమ్‌ గౌత‌మ్ కార్తీక్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం తమిళనాడులోని దిండిగ‌ల్ జిల్లాలోని చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ చిత్రీకరణలో భాగంగా ఓ సన్నివేశాన్ని ఇంటి పైకప్పు పై సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది.

Advertisement

ఈ క్రమంలోనే నటుడు చేరన్ ఇంటి పైకప్పు నుంచి కాలుజారి కింద పడటంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ విధంగా తలకు తీవ్ర గాయమవ్వడంతో అప్రమత్తమైన చిత్రబృందం వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు.తలకు బలమైన గాయం తగలడంతో ఏకంగా ఎనిమిది కుట్లు పడ్డాయి.తనకు అంత పెద్ద గాయం తగిలినప్పటికి తన వల్ల షూటింగ్ ఆగిపోకూడదని భావించి హాస్పిటల్ నుంచి సరాసరి సెట్ కి వెళ్లి సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025
Advertisement

తాజా వార్తలు