AAP Protests : ఢిల్లీలో ఆప్ నిరసనలు.. నెలకొన్న ఉద్రిక్తత ..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్( Kejriwal Arrest ) కు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ భారీ నిరసనలకు పిలుపునిచ్చింది.

ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోదీ నివాసాన్ని ఆప్ నేతలు ముట్టడించనున్నారు.

అయితే ఆప్ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు ప్రధాని నివాసంతో పాటు మెట్రో స్టేషన్లు, సెంట్రల్ ఢిల్లీలో కేంద్ర బలగాలను భారీగా మోహరించారు.

అదేవిధంగా ఢిల్లీలో ట్రాఫిక్ అడ్వయిజరీని పోలీసులు జారీ చేశారు.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam) మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఆప్ నేతల నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

వైరల్ వీడియో : ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..
Advertisement

తాజా వార్తలు