ఘనంగా అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం ఫోటోలు వైరల్!

గత కొద్ది రోజులుగా ఎంతోమంది సెలబ్రిటీలు, సెలబ్రిటీల పిల్లలు పెద్ద ఎత్తున వివాహాలు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఇంకా గతేడాది ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లి బంధంతో ఒకటి కాగా మరి కొంత మంది నిశ్చితార్థం జరుపుకున్నారు.

అయితే తాజాగా కొత్త ఏడాదిలో మరి కొంతమంది సెలబ్రిటీల పిల్లలు కూడా కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్ (Ira khan) వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.

  ప్రియుడు, ఫిట్‏నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేను(Nupur Shikhare)  ఐరా వివాహం చేసుకున్నారు.

ఐరా, నూపుర్‌ల వివాహం బుధవారం ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‏లో గ్రాండ్‏గా జరిగింది.ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు హాజరై సందడి చేశారు అయితే ఈమె వివాహం సాంప్రదాయబద్ధంగా కాకుండా చాలా భిన్నంగా జరిగిందని తెలుస్తుంది.నూపుర్‌ ట్రైనర్ కావడంతో ఈయన దాదాపు 8 కిలోమీటర్ల పాటు జాగింగ్ చేసుకుంటూ రిజిస్టర్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు.

Advertisement

వీరి వివాహం రిజిస్టర్ ఆఫీస్ లోనే( Register Office ) జరిగింది అనంతరం హోటల్లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

హీరో అమీర్ ఖాన్, సినీ నిర్మాత రీనా దత్తా కుమార్తె ఐరా ఖాన్ (27) అన్న విషయం తెలిసిందే.అయితే ఈమె పుట్టిన తర్వాత కొంతకాలానికి వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.అయితే ఈ పెళ్లి వేడుకలలో మాత్రం అమీర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలతో కలిసి సందడి చేశారు.

గత కొంతకాలంగా ఫిట్నెస్ ట్రైనర్ తో ప్రేమలో ఉన్నటువంటి ఈమె గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఇటలీలో నిశ్చితార్థం చేసుకున్నారు.పెళ్లికి ముందు ఇటీవల ముంబైలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.

తాజాగా వీరి పెళ్లి జరగడంతో పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు