వివాదాస్పద హీరోతో మోడీ విందు

అసహనం మీద ఆమీర్ ఖాన్ చేసిన వివాదాస్పద వాఖ్యలు ఎంత రచ్చ చేసాయో మనందరికీ తెలిసిందే.

ఆ వాఖ్యాల ప్రభావం వల్లేనెమో భారత ప్రభుత్వం ఆమీర్ ని ఇంక్రిడబుల్ ఇండియా తో పాటు రోడ్ సేఫ్టి ప్రచారకర్త పదవి నుంచి తొలగించేసింది.

ఆమీర్ సేక్యురిటిని తగ్గించడం కూడా ఒక సంచలనం.దేశవ్యాప్తంగా చాలామంది అభిమానుల్ని ఆ వాఖ్యాల ద్వారా పోగుట్టుకున్న ఆమీర్ ఇప్పుడు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు.

ఒకవైపు బీజీపీ లీడర్లు ఆమీర్ పై రోజుకో రీతిలో విరుచుకుపడుతూ ఉంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆమీర్ ని డిన్నర్ కి ఆహ్వానించారు.ముంబైలోని టర్ఫ్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఇతర దేశాలనుంచి సామాజికవేత్తలు, లీడర్లు , ముఖ్య అధికారులు హాజరయ్యారు.

మోడీ ఆహ్వానాన్ని అందుకున్న ఆమీర్ సమావేశానికి వెళ్ళాడు.చర్చల అనంతరం అందరు కలిసి విందులో పాల్గొన్నారు.

Advertisement
మోడీ- ఆమీర్ కి మధ్య ఉన్న గొడవలు దీనితో సమాప్తం అయిపోయినట్టేనా లేక , ఎదో తప్పదు అన్నట్టు ఇద్దరు కలుసుకున్నారా ! ఇంకోరకంగా ఆలోచిస్తే, ఆమీర్ మీద వ్యతరేకత లేదు మోడీ చెప్పడానికి, ఈ ప్రభుత్వంతో నాకు ఇబ్బంది లేదు అని ఆమీర్ చెప్పడానికి కలుసుకున్నారేమో !.

నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?
Advertisement

తాజా వార్తలు