కాంగ్రెస్కు నక్షత్రకుడులా మారిన ఆమ్ ఆద్మీ ?

దశాబ్దాల పాటు భారత్ ను పరిపాలించిన కాంగ్రెస్( Congress party ) తన స్వయంకృతాపరదాలతో కొన్ని రాష్ట్రాలను, అవినీతి ఆరోపణలతో మరికొన్ని రాష్ట్రాలను వర్గపోరుతో మరికొన్ని రాష్ట్రాలను ఇలా దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని కోల్పోయి దయనీయ స్థితికి చేరింది.

దాంతో అవకాశాన్ని చేజిక్కించుకున్న భాజపా ఇప్పటికే రెండు పర్యాయాలు ఢిల్లీ గద్దెలో కూర్చుంది.

తన బలం కన్నా ప్రత్యర్థి బలహీనతలను ఎక్కువగా ఉపయోగించుకున్న భాజపా కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాలను కూడా తనదైన లౌక్యంతో పడగొట్టి తన ప్రభుత్వాలు తిరిగి పునస్సృష్టించింది.అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, భాజపా పరిపాలన వైఫల్యాలు, ప్రజా ఉద్యమాలను నిర్ధాక్షిణ్యంగా అణిచివేయటం వంటివి ప్రజాస్వామ్యవాదులలో వ్యతిరేకత కలుగచేయగా, కేంద్ర ప్రభుత్వ సంస్థలను తెగ నమ్మడం,సమాఖ్య వ్యవస్థకు తూట్లు పోవడం వంటివి దేశవ్యాప్తంగా భాజపా పట్ల కొంత వ్యతిరేకత పెంచాయి .దాంతో బలంగా పుంజుకోకపోయినప్పటికీ కాంగ్రెస్కు పునర్ వైభవం వచ్చే అవకాశం వచ్చింది.కాంగ్రెస్ కూడా అంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుకునేందుకు బలంగానే ప్రయత్నం చేస్తుంది .

అయితే మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi party ) కాంగ్రెస్కు పక్కలో బల్లెంలా తయారైంది .కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రతి చోట తాను కూడా పోటీ చేస్తానంటూ ముందుకు వస్తుంది.ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికి పంజాబ్( Punjab ) లో కాంగ్రెస్ ఆప్ హోరాహోరీ గా తలపడుతున్నాయి .ఇప్పుడు ఆప్ మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని చూడడం కాంగ్రెస్ కు కొత్త తలనెప్పులు తీసుకువస్తుంది .

చతిస్గడ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పూర్తిస్థానలలో పోటీ చేస్తామంటూ ఆ పార్టీ ప్రకటించడం కాంగ్రెస్కు కాక తెప్పిస్తుంది.ఒకపక్క మిత్రపక్షంగా ఉంటూనే మరో పక్క తమకు చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ వైఖరి పై కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్రు గానే ఉన్నట్లు తెలుస్తుంది .అయితే ఆప్ తో ఇప్పుడు సఖ్యత చెడగొట్టుకుంటే అది ఇండియా కూటమి ఐక్యతకు బీటలు తెచ్చే అవకాశం ఉందన్న అంచనాతో ఆచితూచి స్పందిస్తుంది .మరి రానున్న రోజుల్లో ఆప్ దూకుడు మరింత పెరిగితే మాత్రం ఇండియా కూటమి ఐక్యత ప్రశ్నార్ధకమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.

Advertisement
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

తాజా వార్తలు