ఓటర్‌ ఐడీకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి..?!

ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయిపోయింది.ఏ పని చేయాలన్న గాని ఆధార్ అనుసంధానం అయితే గాని జరగడం లేదు.

ఈ క్రమములో ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.అది ఏంటంటే ఇక మీదట ఓటర్‌ ఐడీ కార్డుకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌లో ప్రకటన చేసింది.

ఈ విషయాన్నీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్వెల్లడించారు.ఇకమీదట ఓటర్ ఐడీకి ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు.

ఇలా ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయడం వలన ఎవరు ఎక్కడ ఓటేశారో తెలుసుకోవవడం సులువు అవుతుందని ఆయన తెలిపారు.ఓటు హక్కు పరిరక్షణకకు ఇది దోహదపడుతుందన్నారు.

Advertisement

ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నగాని ఒక వ్యక్తికి అనేక ఓటర్ కార్డులుండడం మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాము.అలాగే మరి కొంతమంది తమ ఓటు ఓటు గల్లంతు అయ్యందంటూ, కనిపించడం లేదంటూ, నా ఓటు మరొకరు వేశారంటూ ఆందోళన వ్యక్తం చేసేవారు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినాగాని ప్రతిసారి ఎన్నికల సంఘానికి ఇదో పెద్ద గుదిబండ వ్యవహారం లాగా మారుతుంది.

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా గాని ఎన్నికల కమిషన్ బోగస్ కార్డులను నియత్రించలేకపోతోంది.ఈ క్రమంలోనే బోగస్ కార్డులను అరికట్టేందుకు ఓటర్ గుర్తింపు కార్డులకు ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఇప్పటికే న్యాయ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.ఓటర్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు బోగస్ ఓట్లను సులభంగా తీసేవేయవచ్చని పేర్కొంది.

అలాగే లోక్‌సభలో కేంద్రమంత్రి కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావించడంతో ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.ఇలా ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం కనుక చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి వారు వాళ్ళ వోటుని వినియోగించుకునే అవకాశం వస్తుంది.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు