A1 లేదా A2... మీరు ఏ పాలు తాగుతారు? ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసుకోండి

పాలు అందించే ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు.ఆవు పాలు ఎక్కువ ఆరోగ్యకరమా లేక గేదె పాలా అనే చర్చ జరుగుతుంది.

అయితే పాలలో మరొక వర్గం ఉందని మీకు తెలుసా? దీనిని A1 లేదా A2 అని పిలుస్తారు.చాలామంది A2 పాలు మరింత ఆరోగ్యకరమైనవి అని నమ్ముతారు.

A1 Or A2 Which Milk Do You Drink-A1 లేదా A2#8230; మీరు ఏ ప�

అయితే A1 మరియు A2 అంటే ఏమిటి? దానిని ఏ ప్రాతి పదికన వర్గీకరించార‌నే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తవానికి A1 లేదా A2 పాల మధ్య వ్యత్యాసం దానిలోని పోషకాల ఆధారంగా నిర్ణ‌యిస్తారు.

ఇందులో కూడా ముఖ్యంగా ప్రొటీన్ పరిమాణం, ప్రొటీన్ నాణ్యత ఆధారంగా విభజిస్తారు.పాలలో లాక్టోస్, ప్రోటీన్, కొవ్వు, కాల్షియం మరియు ఇతర విటమిన్లు మరియు ఖనిజాలు వంటి పోషకాలు ఉంటాయి.

Advertisement

పాల‌ను దానిలోని ప్రోటీన్ ఆధారంగా విభజిస్తారు.కేసిన్ ప్రోటీన్‌లో ఆల్ఫా మరియు బీటా ప్రోటీన్లు ఉంటాయి.

ఇందులోని బీటా ప్రొటీన్లకు A1 మరియు A2 అని పేరు పెట్టారు.సాంకేతిక పరంగా, A1 లేదా A2 మధ్య తేడా ఏమిటో మీరు తెలుసుకున్నారు.

మన దేశీయ జాతులు కూడా A2 కేటగిరీలో వస్తాయి, అయితే మిశ్రమ జాతి ఆవులు A1 కేటగిరీలో వస్తాయి.అదే సమయంలో, చాలా మంది ఈ ఆవు ప్రాంతాల ఆధారంగా విభజించబడిందని పేర్కొన్నారు.A2 పాలలో యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.మరియు సులభంగా జీర్ణమవుతాయి.

మీకు జీర్ణక్రియలో సమస్యలు ఉంటే లేదా లాక్టోస్‌ను జీర్ణం చేయలేకపోతే, A2 పాలు మీకు మంచి ఎంపిక.మరోవైపు, A1 పాలలో తక్కువ ప్రోటీన్ ఉంటుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

అయితే తల్లి పాలు బిడ్డకు అత్యంత పోషకమైనవి మరియు ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడతాయి.ఈ విష‌యంలో ఉప‌యోగిచాల్సివ‌స్తే A2 పాలు ఉత్త‌మ‌మైన‌వ‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
" autoplay>

తాజా వార్తలు